Leviticus 21:8
అతడు నీ దేవుడికి ‘నైవేద్యం’ అర్పించే వాడు గనక నీవు అతణ్ణి పరిశుద్ధపరచాలి. మిమ్మల్ని పరిశుద్ధ పరిచే యెహోవా అనే నేను పవిత్రుణ్ణి గనక అతడు మీ దృష్టికి పవిత్రుడుగా ఉండాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 19:14అప్పుడు మోషే కొండ దిగి ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలను పవిత్ర పరిచాడు. ప్రజలు తమ బట్టలు ఉతుక్కున్నారు.
Exodus 29:1“నాకు యాజకులయ్యేలా వాళ్ళను ప్రతిష్ట చేయడానికి నువ్వు ఈ విధంగా చెయ్యి.
Leviticus 11:44ఎందుకంటే నేను యెహోవాని. మీ దేవుణ్ణి. నేను పరిశుద్ధుణ్ణి. కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండేలా శుద్ధీకరణ చేసుకోండి. నేలపైన పాకే జీవుల మూలంగా మిమ్మల్ని మీరు మలినం చేసుకోవద్దు.
Leviticus 20:7కాబట్టి మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్టించుకుని పవిత్రంగా ఉండండి. నేను మీ దేవుడైన యెహోవాను.
Leviticus 21:6వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండాలి. తమ దేవుని నామాన్ని అప్రదిష్ట పాలు చెయ్యకూడదు. ఎందుకంటే వారు తమ దేవునికి ‘నైవేద్యం’ అంటే యెహోవాకు హోమద్రవ్యాలు అర్పించే వారు. కాబట్టి వారు పవిత్రంగా ఉండాలి.
Numbers 28:2“నువ్వు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి వారితో చెప్పు. నాకు ఇష్టమైన సువాసనగా మీరు దహనబలి అర్పణగా నాకు అర్పించే ఆహారం నియామక కాలంలో నా దగ్గరికి తేవడానికి జాగ్రత్త పడాలి.