Leviticus 25:39
నీ స్వజాతి వాడు పేదవాడై తనను నీకు అమ్మేసుకుంటే వాడిచేత బానిసలా ఊడిగం చేయించుకో కూడదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
40వాడు సేవకునిలాగా పరదేశిలాగా నీ దగ్గర ఉండి సునాద సంవత్సరం వరకూ నీ దగ్గర సేవకుడుగా పని చేస్తాడు.
Cross References
Exodus 21:2మీరు హెబ్రీవాడైన వ్యక్తిని దాసుడుగా కొనుక్కున్న పక్షంలో ఆరు సంవత్సరాలపాటు మీకు దాసుడుగా ఉండి, ఏడో సంవత్సరంలో మీకు ఏమీ చెల్లించకుండానే మీ నుండి విడుదల పొందవచ్చు,
Leviticus 25:46అలాటి బానిసలను మీ తరవాత మీ సంతానానికి కూడా ఆస్తిగా సంపాదించుకోవచ్చు. వారు శాశ్వతంగా మీకు బానిసలౌతారు. కానీ మీ సోదర ఇశ్రాయేలీయులతో కఠినమైన చాకిరీ చేయించుకోకూడదు.
1 Kings 9:22అయితే సొలొమోను ఇశ్రాయేలీయుల్లో ఎవరినీ బానిసలుగా చేయలేదు. వారిని సైనికులుగా, తన సేవకులుగా, అధికారులుగా, సైన్యాధిపతులుగా తన రథాలకు, రౌతులకు అధిపతులుగా చేసుకున్నాడు.
2 Chronicles 28:10ఇప్పుడు మీరు యూదావారిని యెరూషలేము నివాసులను బానిసలుగా చేసుకోవాలనుకుంటున్నారు. అయితే మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రం అపరాధులు కాకుండా ఉంటారా?
Jeremiah 25:14ఎందుకంటే నేను వాళ్ళ పనులకూ వాళ్ళు చేతులతో చేసిన వాటికీ ప్రతీకారం చేస్తాను. అనేక రాజ్యాలూ, గొప్ప రాజులూ వాళ్ళ చేత సేవ చేయించుకుంటారు. 1 దేవుని కోప పాత్ర 1
Jeremiah 30:8సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా అంటున్నాడు “ఆ రోజు, నీ మెడ మీద ఉన్న నీ కాడి విరిచి, నేను నీ బంధకాలు తెంపుతాను. ఇంక విదేశీయులు నీ చేత దాస్యం చేయించుకోరు.