Leviticus 4:35
తరువాత శాంతిబలి పశువు క్రొవ్వుని వేరు చేసినట్టే దీని కొవ్వు అంతా తీయాలి. యాజకుడు యెహోవాకు దహనబలి అర్పించే చోట బలిపీఠం పైన దాన్ని దహించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 4:20ఈ విధంగా అతడు ఆ కోడెకి చేయాలి. పాపం కోసం బలి ఇచ్చే పశువుకు చేసినట్టుగానే దీనికీ చేయాలి. ఇలా యాజకుడు ప్రజల కోసం పరిహారం చేసినప్పుడు వారికి క్షమాపణ కలుగుతుంది.
Leviticus 4:30దాని రక్తాన్ని యాజకుడు వేలితో తీసుకుని దహన బలిపీఠం పైని కొమ్ములకు పూయాలి. మిగిలిన రక్తాన్ని దహన బలిపీఠం అడుగు భాగంలో పారబోయాలి.
Leviticus 5:10తరువాత ఆదేశాల్లో చెప్పినట్టు రెండో పక్షిని దహనబలిగా అర్పించాలి. అతడు చేసిన పాపం కోసం యాజకుడు పరిహారం చేస్తాడు. అప్పుడు అతనికి క్షమాపణ కలుగుతుంది.
Leviticus 6:7యాజకుడు యెహోవా సమక్షంలో అతని పాపం కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు అతడు ఏ ఏ విషయాల్లో అపరాధి అయ్యాడో ఆ విషయాల్లో క్షమాపణ పొందుతాడు.” 1 దహనబలి
Leviticus 12:8ఆమెకు ఒకవేళ గొర్రె పిల్లని తీసుకువచ్చే స్తోమత లేకపోతే, ఆమె రెండు తెల్ల గువ్వలనైనా రెండు పావురం పిల్లలనైనా తీసుకు రావాలి. వాటిలో ఒకటి దహనబలిగా, మరొకటి పాపంకోసం బలి అర్పణగా తీసుకు రావాలి. యాజకుడు ఆమె కోసం పరిహారం చేస్తాడు. అప్పుడామె శుద్ధురాలు అవుతుంది.”
Leviticus 14:53అయితే బతికి ఉన్న పక్షిని పట్టణం బయట మైదానాల్లో వదిలివేయాలి. ఈ విధంగా ఆ ఇంటి కోసం పరిహారం చేయాలి. అప్పుడు ఆ ఇల్లు శుద్ధి అవుతుంది.