Leviticus 4:8
తరువాత అతడు పాపం కోసం బలి అర్పణ చేసిన ఆ కోడెదూడ కొవ్వు అంతా కోసి వేరు చేయాలి. దాని అంతర్భాగాలను కప్పి ఉన్న కొవ్వునూ, దాని అంతర్భాగాలను అంటి ఉన్న కొవ్వునూ వేరు చేయాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 3:9ఆ వ్యక్తి శాంతిబలి అర్పణను దహనబలి అర్పణగా యెహోవాకు అర్పిస్తాడు. ఆ బలి పశువు కొవ్వునూ, వెన్నెముక చివర వరకూ ఉండే కొవ్వు పట్టిన తోకనంతా, దాని అంతర్భాగాలకి పట్టి ఉన్న కొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే కొవ్వునూ తీసి వేరు చేయాలి.
Leviticus 4:19తరువాత దాని కొవ్వు అంతటినీ తీసి దహన బలిపీఠం పైన దహించాలి.
Leviticus 4:31తరువాత శాంతిబలి పశువు కొవ్వును వేరు చేసినట్టే దీని కొవ్వు అంతా తీయాలి. యాజకుడు ఆ కొవ్వును యెహోవాకు కమ్మని సువాసనగా బలిపీఠం పైన దహించాలి. ఈ విధంగా యాజకుడు ఆ వ్యక్తి కోసం పరిహారం చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ కలుగుతుంది.
Leviticus 7:3దాని కొవ్వు పట్టిన తోకనూ, దాని అంతర్భాగాల్లోని కొవ్వునూ,
Isaiah 53:10అయినా ఆయన్ని నలగ్గొట్టడం, బాధించడం యెహోవాకు ఇష్టమయింది. ఆయన అతనికి వ్యాధి కలగచేశాడు. 1 ఆయన జీవితాన్ని మీ పాప పరిహారంగా మీరు ఎంచితే ఆయన తన సంతానాన్ని చూస్తాడు. ఆయన చాలాకాలం జీవిస్తాడు. 1 ఆయన ద్వారా యెహోవా ఉద్దేశం నెరవేరుతుంది. 1