Leviticus 9:3
నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి ఇలా చెప్పాలి. యెహోవాకి అర్పించడానికి పాపం కోసం బలిగా లోపం లేని మేకపోతునూ, దహనబలి కోసం ఒక్క సంవత్సరం వయసున్న లోపం లేని ఒక దూడనూ, ఒక గొర్రెపిల్లనూ, తీసుకు రండి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 4:3నేరం ప్రజల పైకి వచ్చేలా ఒకవేళ + 4:3 ప్రధాన యాజకుడు.అభిషేకం పొందిన యాజకుడే అలాంటి పాపం చేస్తే, అతడు తన పాపం కోసం బలిగా లోపం లేని కోడెదూడని యెహోవాకు అర్పించాలి.
Leviticus 12:6కొడుకైనా, కూతురైనా వాళ్ళ కోసం ఆమె శుద్ధి రోజులు పూర్తయ్యాక ఆమె ఒక సంవత్సరం వయస్సున్న గొర్రె పిల్లని దహనబలిగా తీసుకురావాలి. అలాగే పాపం కోసం అర్పణగా ఒక గువ్వనుగానీ, ఒక తెల్ల పావురం పిల్లని గానీ తీసుకు రావాలి. వీటిని ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి తెచ్చి యాజకుడికి ఇవ్వాలి.
Leviticus 16:5అతడు ఇశ్రాయేలు సమాజం నుండి పాపం కోసం బలిగా రెండు మేక పోతులనూ దహనబలిగా ఒక పొట్టేలునూ తీసుకురావాలి.
Leviticus 23:12మీరు ఆ పనను అర్పించే రోజున నిర్దోషమైన ఏడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పించాలి.
Ezra 10:19వీరు తమ తమ భార్యలను పంపివేస్తామని ప్రమాణం చేశారు. వారు అపరాధులు కావడంవల్ల తమ అపరాధం విషయంలో మందలోనుండి ఒక పొట్టేలును సమర్పించారు.
Romans 8:3-4 ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు. 1 (5) శరీరంతో ఆత్మ ఘర్షణ గలతీ 5:16-18