Luke 14:11
తనను తాను గొప్ప చేసుకునేవాడు తగ్గడం, తగ్గించుకునేవాడు హెచ్చడం జరుగుతుంది.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
For whosoever exalteth himself shall be abased; and he that humbleth himself shall be exalted.
In Context
Cross References
1 Samuel 15:17అప్పుడు సమూయేలు “నీ విషయంలో నువ్వు అల్పుడవుగా ఉన్న సమయంలో ఇశ్రాయేలీయుల గోత్రాలకు ముఖ్యమైన వాడివయ్యావు. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించాడు.
Job 22:29దేవుడు గర్విష్టులను వంచుతాడు. కళ్ళు దించుకునే వారిని కాపాడతాడు. 1
Psalms 18:27బాధపడే వాళ్ళను నువ్వు రక్షిస్తావు. కాని, గర్వంతో కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళను కిందకు అణిచి వేస్తావు! 1
Proverbs 15:33యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానం వృద్ది చేసుకునే సాధనం. వినయం కలిగి ఉంటే గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి.
Proverbs 29:23ఎవరి అహం వాణ్ణి అణచి వేస్తుంది. వినయమనస్కుడు గౌరవానికి నోచుకుంటాడు.
Isaiah 2:17అప్పుడు మనిషి అహంకారం అణిగిపోతుంది. 1 మనుషుల గర్వం తగ్గిపోతుంది. 1 ఆ రోజున యెహోవా మాత్రమే ఘనత పొందుతాడు. 1