Malachi 2:15
ఆయన మీ ఇద్దరినీ ఒక్కటిగా చేశాడు. శరీరం, ఆత్మ రెండూ ఆయనకే చెందుతాయి గదా. అలా ఒకటిగా చేయడం దేనికి? దేవుని మూలంగా వారికి సంతతి కలగాలని. అందువల్ల మిమ్మల్ని మీరే జాగ్రత్తగా కాపాడుకోండి. యవ్వనంలో పెళ్లి చేసుకున్న మీ భార్యలకు ద్రోహం చేసి విశ్వాస ఘాతకులుగా మారకండి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 2:7దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది.
Genesis 6:2దైవ కుమారులు + 6:2 పరలోక ఆత్మలు మనుషుల కూతుళ్ళు అందంగా ఉండడం చూసి, వాళ్ళల్లో తమకు నచ్చిన స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు.
Genesis 24:44“మీరు తాగండి, మీ ఒంటెలకు కూడా నీళ్ళు తోడి పోస్తాను” అని ఏ అమ్మాయి చెప్తుందో ఆ అమ్మాయే నా యజమాని కొడుక్కి నువ్వు నియమించిన భార్య అయి ఉంటుంది అని నేను యెహోవా దగ్గర మనవి చేసుకున్నాను.’
Genesis 27:46రిబ్కా ఇస్సాకుతో “ఏశావు పెళ్ళాడిన హేతు జాతి స్త్రీల వల్ల నా ప్రాణం విసిగిపోయింది. ఈ దేశపు అమ్మాయిలైన హేతు కుమార్తెల్లో వీళ్ళలాంటి మరో అమ్మాయిని యాకోబు కూడా పెళ్ళి చేసుకుంటే ఇక నేను బతికి ఏం ప్రయోజనం?” అంది.
Deuteronomy 7:4ఎందుకంటే వారు నన్ను కాకుండా ఇతర దేవుళ్ళను పూజించేలా మీ కొడుకులను తిప్పివేస్తారు. దాని కారణంగా యెహోవా కోపం మీమీద రేగి ఆయన మిమ్మల్ని త్వరగా నాశనం చేస్తాడు.
Nehemiah 13:24వారి కొడుకుల్లో సగం మంది అష్డోదు భాష మాట్లాడుతున్నారు. వాళ్ళు రకరకాల అన్య భాషలు మాట్లాడుతున్నారు, వారిలో ఎవరికీ యూదుల భాష రాదు.