Matthew 10:26
కాబట్టి మీరు వారికి భయపడవద్దు. కప్పిపెట్టింది ఏదీ బట్టబయలు కాకుండా ఉండదు. రహస్యంగా ఉంచింది ఏదీ తెలియకుండా ఉండదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
27మీతో నేను చీకట్లో చెప్పేది వెలుగులో చెప్పండి. మీ చెవిలో వినిపించేది మేడలమీద చాటించండి. 1 అభయం
Cross References
Proverbs 28:1ఎవరూ తరుమకుండానే దుష్టుడు పారిపోతాడు. నీతిమంతులు సింహం లాగా ధైర్యంగా ఉంటారు.
Isaiah 41:10నువ్వు నా దాసుడనీ, నిన్ను తోసిపుచ్చకుండా నేను నిన్నే ఎన్నుకున్నాననీ నీతో చెప్పాను. 1 నీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు. నేను నీ దేవుణ్ణి. 1 దిగులు పడవద్దు. నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేస్తాను. 1 నీతి అనే నా కుడిచేతితో నిన్ను ఆదుకుంటాను. 1
Isaiah 43:1అయితే యాకోబూ, నిన్ను పుట్టించిన యెహోవా, ఇశ్రాయేలూ, నిన్ను నిర్మించినవాడు ఇలా చెబుతున్నాడు, 1 “నేను నిన్ను విమోచించాను, భయపడకు. నిన్ను పేరుపెట్టి పిలుచుకున్నాను. నువ్వు నా సొత్తు. 1
Isaiah 51:12నేను, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. 1 చనిపోయే మనుషులకు, గడ్డిలాంటి మనుషులకు మీరెందుకు భయపడతారు? 1
Jeremiah 1:17“కాబట్టి లేచి నిలబడు! నేను నీకాజ్ఞాపించినదంతా వారికి ప్రకటించు. నువ్వు వారికి భయపడ వద్దు. లేదా, నేనే నీకు వారంటే భయం పుట్టిస్తాను.
Matthew 10:28“ఆత్మను చంపలేక శరీరాన్నే చంపేవారికి భయపడవద్దు. ఆత్మనూ శరీరాన్నీ నరకంలో పడేసి నాశనం చేయగల వాడికే భయపడండి.