Matthew 21:42
అప్పుడు యేసు వారితో, 1 “‘ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి చివరికి ముఖ్యమైన పునాది రాయి అయ్యింది. 1 దీన్ని ప్రభువే చేశాడు. ఇది మనకు ఆశ్చర్యకరం,’ 1 అనే మాట మీరు లేఖనాల్లో ఎప్పుడూ చదవలేదా?
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 28:16దానికి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. 1 “చూడండి, నేను సీయోనులో ఒక పునాది రాయి వేస్తాను. అది పరిశోధనకి గురైన రాయి + 28:16 కీర్తన 118:22-23, రోమి. 9:33; 10:11, 1పేతురు 2:6. 1 ఒక ప్రశస్తమైన మూలరాయిని వేస్తాను. అది దృఢమైన పునాది రాయి. విశ్వాసం ఉంచే వాడు సిగ్గుపడడు. 1
Zechariah 3:8ప్రధాన యాజకుడవైన యెహోషువా, నీ యెదుట కూర్చుని ఉన్న నీ సహకారులు జరగబోయేవాటికి సూచనలుగా ఉన్నారు. నువ్వూ, వాళ్ళూ నా మాట ఆలకించాలి. అది ఏమిటంటే, ‘చిగురు’ అనే నా సేవకుణ్ణి నేను రప్పించబోతున్నాను.
Luke 20:17ఆయన వారిని చూసి, “అలాగైతే, ‘ఇల్లు కట్టేవారు పనికి రాదని తీసివేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది’ అని రాసి ఉన్న మాట సంగతి ఏమిటి?
Acts 13:40కాబట్టి ప్రవక్తలు చెప్పినవి మీ మీదికి రాకుండా జాగ్రత్త పడండి. అవేవంటే, 1
Ephesians 2:20క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయిగా ఉండి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడ్డారు.
1 Peter 2:4మనుషులు తిరస్కరించినా, దేవుడు ఎన్నుకున్నదీ విలువైనదీ, సజీవమైన రాయి అయిన ప్రభువు దగ్గరికి రండి.