మత్తయి 24:15
“కాబట్టి దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా చెప్పిన ‘వినాశకారి అయిన హేయ వస్తువు’ అతి పరిశుద్ధ స్థలంలో నిలవడం మీరు చూడగానే (చదివేవాడు గ్రహిస్తాడు గాక),
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
16యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవాలి.
Cross References
Ezekiel 40:4ఆ మనిషి నాతో ఇలా అన్నాడు. “నరపుత్రుడా, నేను నీకు చూపేవాటిని కళ్ళారా చూసి, చెవులార విని నీ మనస్సులో ఉంచుకో. వాటిని నీకు చూపడానికే నిన్నిక్కడికి తెచ్చాను. నువ్వు చూసిన వాటన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజెయ్యి.” 1 తూర్పు గుమ్మపు ద్వారం నుండి బయటి ఆవరణం వరకు
Daniel 9:25యెరూషలేమును మళ్ళీ కట్టించవచ్చని ఆజ్ఞ బయలు దేరిన సమయం మొదలుకుని అభిషిక్తుడైన నాయకుడు + 9:25 అభిషిక్తుడైన నాయకుడు ఎనుక్కొన నాయకుడు వచ్చే దాకా ఏడు ఏడులు, 62 ఏడులు పడుతుందని గ్రహించి అర్థం చేసుకో. దురవస్థ గల కాలం అయినప్పటికీ పట్టణం రాచవీధులను కందకాలను మళ్ళీ కడతారు.
Daniel 10:12అప్పుడతడు “దానియేలూ, భయపడకు. నీవు తెలుసుకోవాలని నీ మనస్సు లగ్నం చేసి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి రోజు మొదలు నీవు చెప్పిన మాటలు వినబడినాయి గనక నీ మాటలను బట్టి నేను వచ్చాను.
Daniel 12:11అనుదిన బలి నిలుపు చేయబడిన కాలం మొదలు నాశనం కలగజేసే హేయమైన దాన్ని నిలబెట్టే వరకూ 1, 290 దినాలౌతాయి.
Luke 19:43ప్రభువు నిన్ను సందర్శించిన కాలం నువ్వు తెలుసుకోలేదు. కాబట్టి నీ శత్రువులు నీ చుట్టూ మట్టిదిబ్బ కట్టి నిన్ను ముట్టడించి అన్ని వైపుల నుండి నిన్ను అణచివేస్తారు. నిన్నూ నీలో ఉన్న నీ పిల్లలనూ మంటిపాలు చేస్తారు.
John 11:48మనం ఇతన్ని ఇలాగే వదిలేస్తే, అందరూ ఇతన్నే నమ్ముతారు. రోమీయులు వచ్చి మన భూమినీ, మన రాజ్యాన్నీ, రెంటినీ తీసుకుపోతారు” అన్నారు.