Micah 2:11
పనికి మాలిన మాటలు చెబుతూ అబద్ధాలాడుతూ ఎవడైనా ఒకడు వచ్చి, 1 “ద్రాక్షారసం గురించి, మద్యం గురించి నేను మీకు ప్రవచనం చెబుతాను” అంటే, 1 వాడే ఈ ప్రజలకు ప్రవక్త అవుతాడు. 1 విమోచన వాగ్దానం
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Kings 22:6ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి “యుద్ధానికి రామోత్గిలాదు మీదికి వెళ్ళాలా, వద్దా?” అని వారినడిగాడు. వాళ్ళు “వెళ్ళండి, దాన్ని యెహోవా రాజైన మీ వశం చేస్తాడు” అన్నారు.
2 Chronicles 18:19‘ఇశ్రాయేలు రాజు అహాబు రామోతు గిలాదు మీద యుద్ధానికి వెళ్ళి చనిపోయేలా అతణ్ణి ఎవరు ప్రేరేపిస్తారు?’ అని యెహోవా అడిగాడు. అప్పుడు, ఒకడు ఒక రకంగా, ఇంకొకడు మరొక రకంగా జవాబిచ్చారు.
Isaiah 30:10దర్శనాలు చూసే వాళ్ళతో “దర్శనం చూడవద్దు” అని చెప్తారు. ప్రవక్తలకు “కచ్చితమైన సత్యాన్ని మాకు ప్రవచించ వద్దు. మృదువైన సంగతులే మాతో చెప్పండి. మాయా దర్శనాలు చూడండి. తప్పుడు ప్రవచనాలు మాకు చెప్పండి. 1
Jeremiah 6:13“వారిలో అత్యల్పులు, గొప్పవారు అందరూ మోసం చేసేవారే, దోచుకొనేవారే. ప్రవక్తలు గాని, యాజకులు గాని అందరూ వంచకులే. 1
Jeremiah 14:14అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు. “ప్రవక్తలు నా పేరున అబద్ధాలు ప్రకటిస్తున్నారు. నేను వాళ్ళను పంపలేదు. వాళ్ళకు ఎలాంటి ఆజ్ఞా ఇవ్వలేదు. వాళ్ళతో మాట్లాడలేదు. అయితే వాళ్ళ హృదయాల్లోనుంచి మోసపూరితమైన దర్శనాలూ పనికిమాలిన, మోసపు శకునాలూ వస్తున్నాయి. వీటినే వాళ్ళు మీకు ప్రవచిస్తున్నారు.
Jeremiah 23:17“మీకు శాంతిక్షేమాలు కలుగుతాయని యెహోవా చెబుతున్నాడు” అని నన్ను తృణీకరించే వాళ్ళతో అదే పనిగా చెబుతున్నారు. “మీ మీదికి ఏ కీడూ రాదు” అని తన హృదయ మూర్ఖత ప్రకారం నడుచుకునే ప్రతివారూ చెబుతున్నారు. 1