Nehemiah 1:4
ఈ మాటలు విన్న వెంటనే నేను కుప్పగూలిపోయి ఏడ్చి, కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసం ఉన్నాను. ఆకాశంలో ఉన్న దేవునికి ఇలా విజ్ఞాపన చేశాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Kings 22:19ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, ఈ స్థలం పాడవుతుందని, దాని కాపురస్థులు శాపానికి గురి అవుతారని నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి, మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిలో దీనత్వం కలిగి, నీ బట్టలు చింపుకుని నా సన్నిధిలో కన్నీళ్లు కార్చావు గనుక నీవు చేసిన మనవి నేను అంగీకరించాను.
Ezra 1:2“పర్షియా రాజు కోరెషు ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆకాశంలో ఉండే దేవుడైన యెహోవా లోకంలో ఉన్న ప్రజలందరినీ నాకు లోబరిచాడు. ఆయన యూదా దేశంలో ఉన్న యెరూషలేములో తనకు మందిరం కట్టించాలని నాకు ఆజ్ఞ ఇచ్చాడు.
Ezra 9:3ఈ సంగతి విని నేను నిర్ఘాంతపోయాను. నా అంగీనీ, దుప్పటినీ చింపుకుని, నా తల వెంట్రుకలు, గడ్డపు వెంట్రుకలు పెరికి వేసుకుని కూర్చుండిపోయాను.
Ezra 10:1ఎజ్రా దేవుని మందిరం ముందు సాష్టాంగపడి విలపిస్తూ, పాపం ఒప్పుకొంటూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఇశ్రాయేలు పురుషులు, స్త్రీలు, పిన్నలూ గుంపులు గుంపులుగా అతని దగ్గరికి వచ్చి గట్టిగా రోదించారు.
Nehemiah 2:20అందుకు నేను “ఆకాశంలో ఉన్న దేవుడే మా పని సఫలం చేస్తాడు. మేము ఆయన సేవకులం. మేమంతా పూనుకుని కడతాం. అయితే మీకు మాత్రం యెరూషలేంలో భాగం గానీ, హక్కు గానీ, వారసత్వపరమైన వంతు గానీ ఎంత మాత్రం లేవు” అన్నాను.
Psalms 102:13నువ్వు లేచి సీయోనును కనికరిస్తావు. దానిమీద దయ చూపడానికి సరైన సమయం వచ్చింది. 1