Nehemiah 12:39
ఆ గుంపు వాళ్ళు ఎఫ్రాయీం ద్వారం మీదగా వెళ్లి, పాత ద్వారాన్ని, మత్స్యపు ద్వారాన్ని, హనన్యేలు గోపురాన్ని, మేయా గోపురాన్ని దాటి వెళ్ళి, గొర్రెల ద్వారం వరకూ ఎక్కి బందీ గృహం ద్వారం దగ్గర నిలిచారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Nehemiah 3:1ప్రధానయాజకుడు ఎల్యాషీబు, అతని సోదర యాజకులు పూనుకుని గొర్రెల ద్వారాన్ని కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలబెట్టారు. వాళ్ళు నూరవ గోపురం, హనన్యేలు గోపురం వరకూ ప్రతిష్టించారు. వాటికి సరిహద్దు గోడలు కట్టి ప్రతిష్ఠించారు.
Nehemiah 3:6పాసెయ కొడుకు యెహోయాదా, బెసోద్యా కొడుకు మెషుల్లాము పాత ద్వారం బాగుచేసి దానికి దూలాలు అమర్చి తలుపులు నిలబెట్టి తాళాలు, గడియలు అమర్చారు.
Nehemiah 3:31ఆలయ సేవకుల స్థలానికి, పరిశీలన ద్వారానికి ఎదురుగా ఉన్న వ్యాపార కూడలి మూల వరకూ కంసాలి మల్కీయా బాగు చేశాడు.
Jeremiah 31:38యెహోవా ఇలా అంటున్నాడు, 1 “హనన్యేలు గోపురం మొదలుకుని మూలగుమ్మం వరకూ నా కోసం ఆ పట్టణం పునర్నిర్మాణం అయ్యే రోజులు వస్తున్నాయి. 1
Zephaniah 1:10ఆ రోజున చేప ద్వారంలో రోదన ధ్వని, పట్టణం దిగువ భాగంలో అంగలార్పు వినబడుతుంది. కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వస్తుంది. ఇదే యెహోవా వాక్కు.