Nehemiah 13:18
మీ పూర్వికులు ఇలాగే చేసి మన మీదికి, మన పట్టణాల మీదికి దేవుని నుండి కీడు కలిగేలా చేశారు కదా. మీరు విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేసి ఇశ్రాయేలీయుల మీదికి దేవుని కోపం మరింతగా రప్పిస్తున్నారు” అని చెప్పాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 31:12యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. మీరు నేను నియమించిన విశ్రాంతి దినాన్ని కచ్చితంగా ఆచరించాలి.
Leviticus 26:28నేను కోపపడి మీకు విరోధంగా నడుస్తాను. నేనే మీ పాపాలను బట్టి ఏడంతలుగా మిమ్మల్ని దండిస్తాను.
Joshua 22:17పెయోరు పర్వతంలో మనం చేసిన దోషం మనకు సరిపోదా? + 22:17 సంఖ్య 25:1-9, కీర్తన 106:28 చూడండి దానివల్ల యెహోవా సమాజంలో తెగులు పుట్టింది. ఇంకా మనం దానినుండి శుద్ధులం కాలేదు.
Ezra 9:14అయితే మేము నీ ఆజ్ఞలు అతిక్రమించి అసహ్యకరమైన పనులు చేసే ఈ ప్రజలతో సాంగత్యం చేసినప్పుడు, తప్పించుకొనే మార్గం లేని విధంగా మాలో ఒక్కడు కూడా మిగలకుండా అందరినీ నాశనం చెయ్యాలన్నంత కోపం నీకు వస్తుంది గదా.
Jeremiah 17:21యెహోవా చెప్పేదేమిటంటే, మీరు జాగ్రత్తగా ఉండి విశ్రాంతి దినాన బరువులు మోయవద్దు. యెరూషలేము ద్వారాలగుండా వాటిని తీసుకు రావద్దు. 1
Jeremiah 44:9మీ పితరులు చేసిన దుర్మార్గాన్నీ, మీ యూదా రాజులూ, వాళ్ళ భార్యలూ చేసిన దుర్మార్గాన్నీ మరచిపోయారా? యూదా దేశంలోనూ, యెరూషలేము వీధుల్లోనూ మీరూ, మీ భార్యలూ చేసిన దుర్మార్గాన్ని మరచిపోయారా?