నెహెమ్యా 4:14
నేను లేచి, ప్రధానులను, అధికారులను సమకూర్చి “మీరు వాళ్లకు భయపడకండి. అత్యంత ప్రభావశాలి, భీకరుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనండి. మీ సహోదరులు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ భార్యలు, మీ నివాసాలు శత్రువుల వశం కాకుండా వారితో పోరాడండి” అన్నాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 14:14మీరు ఊరికే నిలబడి ఉండండి. మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు” అని ప్రజలతో చెప్పాడు.
Numbers 14:9కాబట్టి, మీరు యెహోవా మీద తిరగబడవద్దు. ఆ దేశ ప్రజలకు భయపడవద్దు. వారు మనకు అన్నం తిన్నంత తేలిక. యెహోవా మనతో ఉన్నాడు గనక వారి భద్రత ఇక వారి పై నుండి తొలిగిపోతుంది. వాళ్లకు భయపడవద్దు” అన్నారు. కాని, ఆ సమూహం, వారిని రాళ్లతో కొట్టి చంపాలన్నారు.
Deuteronomy 1:29అప్పుడు నేను మీతో “దిగులు పడొద్దు, భయపడొద్దు.
Deuteronomy 20:3‘ఇశ్రాయేలూ, విను. ఇవ్వాళ మీరు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. మీ హృదయాల్లో కుంగిపోవద్దు. భయపడవద్దు.
Judges 3:27అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూర ఊదగా ఇశ్రాయేలీయులు అరణ్య ప్రాంతం నుంచి దిగి అతని దగ్గరికి వచ్చారు.
2 Chronicles 20:15“యూదాప్రజలారా, యెరూషలేము నివాసులారా, యెహోషాపాతు రాజా, మీరంతా వినండి. యెహోవా చెప్పేదేమిటంటే, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడవద్దు, నిస్పృహ చెందవద్దు. ఈ యుద్ధం మీది కాదు, దేవునిదే.