Nehemiah 5:7
అప్పుడు నాలో నేను ఆలోచించాను. ప్రధానులను, అధికారులను గద్దించాను “మీరు మీ సహోదరుల దగ్గర వడ్డీ తీసుకొంటున్నారు” అని చెప్పి వారిని ఆ పని మాన్పించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశాను.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
6ఈ విషయాలు, వారి ఆరోపణలు వినగానే నాకు తీవ్రమైన కోపం వచ్చింది.
Cross References
Exodus 22:25నా ప్రజల్లో మీ దగ్గర ఉండే ఒక పేదవాడికి అప్పుగా సొమ్ము ఇచ్చినప్పుడు వారి పట్ల కఠినంగా ప్రవర్తించ కూడదు. వాళ్ళ దగ్గర వడ్డీ వసూలు చేయకూడదు.
Leviticus 25:36అతని దగ్గర వడ్డీ తీసుకోకూడదు. అతని వలన లాభం పొందాలని చూడకూడదు. నీ సోదరుడు నీ మూలంగా బ్రతకాలి. ఆ విధంగా నీ దేవుణ్ణి నీవు గౌరవించాలి.
Deuteronomy 23:19మీరు వెండిని గానీ, ఆహారపదార్ధాలు గానీ వడ్డీకి ఇచ్చే మరి దేనినైనా తోటి ఇశ్రాయేలు ప్రజలకు వడ్డీకి ఇవ్వకూడదు.
2 Chronicles 19:6అతడు న్యాయాధిపతులతో ఇలా చెప్పాడు. “మీరు ఏమి చేయాలో జాగ్రత్తగా ఆలోచించండి, ఎందుకంటే మీరు మనుషుల కోసం కాదు, యెహోవా కోసమే తీర్పు తీర్చాలి. తీర్పు తీర్చే పనిలో ఆయన మీతో ఉంటాడు.
Psalms 4:4భయంతో గడగడ వణకండి, కానీ పాపం చెయ్యకండి. మీరు పడక మీద ఉన్నప్పుడు మీ హృదయాల్లో ధ్యానం చేసుకుని నింపాదిగా ఉండండి. సెలా. 1
Psalms 15:5అప్పు ఇచ్చేటప్పుడు వడ్డీ తీసుకోడు. నిరపరాధికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి లంచం తీసుకోడు. ఇలా చేసేవాడు ఎన్నడూ చలించడు.