Nehemiah 9:2
ఇశ్రాయేలీయులు వేరే జాతి ప్రజల్లో నుండి వేరైపోయి నిలబడి, తమ పాపాలు, తమ పూర్వీకుల పాపాలు ఒప్పుకున్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 26:40వారు నాకు విరోధంగా చేసిన తిరుగుబాటును, తమ దోషాన్ని, తమ తండ్రుల దోషాన్ని ఒప్పుకుని, తాము నాకు విరోధంగా నడిచామని,
Ezra 9:2వారి ఆడపిల్లలను పెళ్లి చేసుకొంటున్నారు, తమ కూతుళ్ళని వారి కొడుకులకు ఇస్తున్నారు. ప్రత్యేక జనంగా ఉండాల్సిన వీరు ఆ జాతుల పవిత్రమైన ప్రజలతో కలిసిపోయారు. పైగా ఈ తప్పులు చేస్తున్న వారిలో మన పెద్దలు, అధికారులు కూడా ప్రముఖంగా ఉన్నారు.”
Ezra 9:15యెహోవా, ఇశ్రాయేలు దేవా, నువ్వు నీతిపరుడివి. కాబట్టి ఈనాటి వరకూ మిగిలిన మేము కొద్దిమందిమే. ఇదిగో, మేము నీ సన్నిధిలో అపరాధులం. నీ సన్నిధిలో నిలబడడానికి ఎవ్వరికీ అర్హత లేదు.”
Nehemiah 1:6నా ప్రార్థన విని, నీ కళ్ళు తెరచి నీ సన్నిధిలో రేయింబవళ్ళు నీ సేవకులైన ఇశ్రాయేలీయుల తరుపున నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించు. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు సంతతి దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేనూ నా వంశం అంతా పాపం చేశాం.
Nehemiah 13:3దీన్ని విన్న ఇశ్రాయేలు ప్రజలు ఇతర దేశాల, జాతుల ప్రజలను తమలో నుండి వెలివేశారు.
Psalms 106:6మా పితరుల్లాగానే మేము పాపం చేశాము. దోషాలు మూటగట్టుకుని భక్తిహీనులమైపోయాము. 1