Numbers 12:11
అప్పుడు అహరోను మోషేతో ఇలా అన్నాడు. “అయ్యో నా ప్రభూ, మేము చేసిన పాపానికి శిక్ష మాకు వేయవద్దు. మేము తెలివి తక్కువగా మాట్లాడి పాపం చేశాం.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
12తన తల్లి గర్భంలోంచి బయటకి వచ్చేటప్పటికే సగం మాంసం పోగొట్టుకున్న మృతశిశువులా ఆమెని ఉండనీయకు.”
Cross References
Exodus 12:32మీ ఇష్టప్రకారం మీ మందలనూ పశువులనూ తోలుకు వెళ్ళండి. నన్ను దీవించండి కూడా” అన్నాడు.
1 Samuel 12:19వారు సమూయేలుతో ఇలా అన్నారు. “రాజు కావాలని మేము అడగడం ద్వారా మా పాపాలన్నిటి కంటే ఎక్కువ పాపం చేశాం. అందువల్ల మేమంతా చనిపోకుండేలా దీనులమైన మా కోసం నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చెయ్యి.”
2 Samuel 19:19“నా యజమానీ, నేను చేసినదాన్ని బట్టి నాపై నేరం మోపవద్దు. రాజువైన నువ్వు యెరూషలేము విడిచివెళ్తున్నప్పుడు నేను మూర్ఖత్వంతో చేసిన తప్పును జ్ఞాపకం పెట్టుకోవద్దు.
1 Kings 13:6అప్పుడు రాజు “నా చెయ్యి తిరిగి బాగయ్యేలా నీ దేవుడు యెహోవా నా మీద దయ చూపేలా నా కోసం వేడుకో” అని ఆ దేవుని మనిషితో అన్నాడు. కాబట్టి దైవ సేవకుడు యెహోవాను వేడుకున్నాడు. రాజు చెయ్యి బాగై మునుపటి లాగా అయింది.
Psalms 38:1యెహోవా, నీ కోపంలో నన్ను గద్దించవద్దు. నీ తీవ్ర కోపంలో నన్ను శిక్షించవద్దు. 1
Jeremiah 42:2వాళ్ళు అతనితో ఇలా అన్నారు. “నువ్వు చూస్తున్నట్టు మేం చాలా తక్కువ మందిమి. మా మనవిని చెవినబెట్టి మిగిలిన ఈ ప్రజల కోసం నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు.