The Bible Software
bible.softwareNumbersNumbers 13 › Numbers 13:22

Numbers 13:22

వారు దక్షిణం వైపు నుండి ప్రయాణం చేసి హెబ్రోనుకి వచ్చారు. అక్కడ అనాకు వంశం వారు అయిన అహీమాను, షేషయి, తల్మయి అనే తెగల ప్రజలు ఉన్నారు. ఆ హెబ్రోను పట్టణాన్ని ఐగుప్తులో ఉన్న సోయను పట్టణం కంటే ఏడేళ్ళు ముందుగా కట్టారు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

And they ascended by the south, and came unto Hebron; where Ahiman, Sheshai, and Talmai, the children of Anak, were. (Now Hebron was built seven years before Zoan in Egypt.)

In Context

21కాబట్టి ఆ వ్యక్తులు బయల్దేరి వెళ్ళారు. వారు లెబో హమాతు అనే ప్రాంతానికి దగ్గరగా సీను అరణ్యం నుండి రెహోబు వరకూ వెళ్లి సంచారం చేశారు.

23వారు ఎష్కోలు లోయ చేరుకున్నారు. అక్కడ ద్రాక్ష గుత్తులు ఉన్న ఒక కొమ్మను కోశారు. దాన్ని ఒక కర్రకి కట్టి ఇద్దరు వ్యక్తులు మోశారు. అక్కడనుంచే కొన్ని దానిమ్మ పళ్ళనూ కొన్ని అంజూరు పళ్ళనూ తీసుకు వచ్చారు.

Read all of Numbers 13

Cross References

Genesis 13:18అప్పుడు అబ్రాము తన గుడారం తీసి, హెబ్రోనులో ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షాల దగ్గర వేసుకుని అక్కడ నివసించాడు. అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు.

Numbers 13:17వారిని కనాను దేశాన్ని చూసి పరీక్షించడానికి మోషే పంపించాడు. అప్పుడు వాళ్లతో ఇలా చెప్పాడు. “మీరు దక్షిణం వైపు నుండి ప్రవేశించి పర్వత ప్రాంతంలోకి ఎక్కి వెళ్ళండి.

Joshua 11:21ఆ సమయంలో యెహోషువ వచ్చి పర్వత ప్రాంత దేశంలో అంటే హెబ్రోనులో, దెబీరులో, అనాబులో, యూదా పర్వత ప్రాంతాలన్నిటిలో, ఇశ్రాయేలు ప్రజల పర్వత ప్రాంతాలన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనం చేశాడు. యెహోషువ వారిని వారి పట్టణాలనూ నిర్మూలం చేశాడు.

Joshua 15:13యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యూదా గోత్రం సరిహద్దు లోపల యెఫున్నె కుమారుడు కాలేబుకు ఒక వంతు, అంటే అనాకీయుల వంశకర్త అర్బా పట్టణాన్ని ఇచ్చాడు. అది హెబ్రోను.

Joshua 21:13హత్యచేసిన వారికి ఆశ్రయ పట్టణంగా ఉన్న హెబ్రోను, దాని పచ్చిక మైదానాలు యాజకుడైన అహరోను సంతానపు వారికి ఇచ్చారు.

2 Samuel 2:1కొంతకాలం తరువాత దావీదు “నేను యూదా పట్టణాల్లో ప్రవేశించ వచ్చా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు. “వెళ్ళు” అని యెహోవా అతనితో చెప్పాడు. “ఏ పట్టణానికి వెళ్ళమంటావు?” అని దావీదు అడిగాడు. “హెబ్రోనుకు వెళ్ళు” అని ఆయన చెప్పాడు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Numbers 13:22

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Numbers 13:21Numbers 13Numbers 13:23 →