Numbers 16:28
అప్పుడు మోషే “ఈ కార్యాలన్నీ చెయ్యడానికి యెహోవా నన్ను పంపాడనీ, నా అంతట నేనే వాటిని చెయ్యలేదనీ దీనివల్ల మీరు తెలుసుకుంటారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 3:12దేవుడు “నువ్వు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకు వచ్చిన తరువాత మీరు ఈ కొండపై దేవుణ్ణి ఆరాధిస్తారు. కచ్చితంగా నేను నీకు తోడుగా ఉంటాను. నేను నిన్ను పంపించాను అని చెప్పడానికి ఇదే సూచన” అన్నాడు.
Exodus 7:9నువ్వు అహరోనుకు నీ చేతికర్రను ఇచ్చి దాన్ని ఫరో ముందు పడవెయ్యమని చెప్పు. అది పాముగా మారిపోతుంది.”
Deuteronomy 18:22ప్రవక్త యెహోవా పేరుతో చెప్పినప్పుడు ఆ మాట జరగకపోతే, ఎన్నటికీ నెరవేరకపోతే అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారంతోనే దాన్ని చెప్పాడు కాబట్టి దానికి భయపడవద్దు.”
Jeremiah 23:16సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. “మీకు ప్రవచనాలు ప్రకటించే ప్రవక్తల మాటలు వినవద్దు. వాళ్ళు మిమ్మల్ని భ్రమపెట్టారు! వాళ్ళు యెహోవా నోటి నుంచి వచ్చినవి కాక తమ సొంత మనస్సులోని దర్శనాలను ప్రకటిస్తున్నారు.” 1
Zechariah 2:9నేను ఆ ప్రజలకు వ్యతిరేకంగా నా చెయ్యి ఎత్తుతాను. వారిని వారి దాసులు దోచుకుంటారు. అప్పుడు సేనల ప్రభువు యెహోవా నన్ను పంపించాడని మీరు తెలుసుకుంటారు.
John 5:30“నా అంతట నేనే దేనినీ చేయలేను. నేను విన్న దాని ప్రకారం తీర్పు తీరుస్తాను. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చూడను గానీ నన్ను పంపిన వాని ఇష్టం నెరవేరాలని చూస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయవంతంగా ఉంటుంది.