Numbers 18:17
కాని ఆవు తొలి చూలుని, గొర్రె తొలి చూలుని, మేక తొలి చూలుని విడిపించకూడదు. అవి ప్రతిష్ఠితమైనవి. వాటి రక్తం నువ్వు బలిపీఠం మీద పోసి, యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగేలా వాటి కొవ్వును కాల్చాలి. కాని వాటి మాంసం నీకు చెందుతుంది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
18అల్లాడించే అర్పణగా ఉన్న బోర, కుడి జబ్బ, నీదైనట్టు అది కూడా నీకు చెందుతుంది.
Cross References
Leviticus 3:2అతడు తాను అర్పించబోయే పశువు తలపై తన చేతిని ఉంచాలి. తరువాత ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర దాన్ని వధించాలి. అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు.
Deuteronomy 15:19మీ ఆవులు, గొర్రెలు, మేకల్లో ప్రతి తొలి చూలు మగపిల్లను యెహోవా దేవునికి ప్రతిష్ఠించాలి. మీ కోడెల్లో తొలిచూలు దానితో పనిచేయకూడదు. మీ గొర్రెలు, మేకల్లో తొలిచూలు దాని బొచ్చు కత్తిరించకూడదు.