Numbers 18:24
అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణగా అర్పించే పదోవంతు భాగాలు నేను లేవీయులకు స్వాస్థ్యంగా ఇచ్చాను. అందుచేత వారు ఇశ్రాయేలీయుల మధ్య స్వాస్థ్యం సంపాదించకూడదని వారితో చెప్పాను” అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 27:30ధాన్యంలో, చెట్ల కాయల్లో, భూమి ఫలమంతటిలో పదవ వంతు యెహోవా స్వంతం. అది యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది.
Numbers 26:62వారిల్లో నెల మొదలుకొని పై వయస్సు కలిగి లెక్కకు వచ్చిన వాళ్లందరూ 23,000 మంది పురుషులు. వారు ఇశ్రాయేలీయుల్లో లెక్కకు రాని వారు గనక ఇశ్రాయేలీయుల్లో వాళ్లకు స్వాస్థ్యం దక్కలేదు.
Joshua 13:14లేవి గోత్రానికే అతడు స్వాస్థ్యం ఇవ్వలేదు. ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా మోషేతో చెప్పినట్టు “ప్రజలు ఆయనకు అర్పించే దహన బలులే” వారికి స్వాస్థ్యం.
Nehemiah 13:12ఆ తరువాత యూదులంతా ధాన్యంలో, ద్రాక్షారసంలో, నూనెలో పదవ వంతు ఖజానాలో జమ చేశారు.