Numbers 22:3
ప్రజలు ఎక్కువగా ఉన్న కారణంగా మోయాబీయులు వారిని చూసి చాలా కంగారుపడ్డారు. మోయాబీయులు ఇశ్రాయేలీయులను చూసి భయభ్రాంతులకు లోనయ్యారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
2సిప్పోరు కొడుకు బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయు పట్ల చేసిందంతా చూశాడు.
Cross References
Exodus 1:12ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను అణగదొక్కేకొద్దీ వారు అంతకంతకూ విస్తరిస్తూ పోవడంతో వారు ఇశ్రాయేలు ప్రజల విషయం భయాందోళనలు పెంచుకున్నారు.
Exodus 23:27నా పేరును బట్టి ఇతరులు మీకు భయపడేలా చేస్తాను. మీ ప్రయాణంలో మీరు దాటుతున్న సమస్త దేశ ప్రజలను ఓడించి నీ శత్రువులు నీ ఎదుట నుండి పారిపోయేలా చేస్తాను.
Joshua 2:10మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చేటప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రజలం ఎలా ఆరిపోయేలా చేశాడో, యొర్దాను తీరాన ఉన్న సీహోను, ఓగు అనే ఇద్దరు అమోరీయ రాజులకు మీరేమి చేశారో, అంటే మీరు వాళ్ళని ఎలా నిర్మూలం చేశారో ఆ సంగతులన్నీ మేము విన్నాం.
Joshua 9:24అందుకు వారు యెహోషువను చూసి “నీ దేవుడు యెహోవా ఈ దేశాన్నంతా మీకిచ్చి, మీ ముందు నిలవకుండా ఈ దేశ ప్రజలందరినీ నాశనం చేయమని తన సేవకుడు మోషేకు ఆజ్ఞాపించాడని నీ దాసులమైన మాకు రూఢిగా తెలిసింది. కాబట్టి మేము మా ప్రాణాల గురించి చాలా భయపడి ఈ విధంగా చేశాం.
Isaiah 23:5ఆ సమాచారం విని ఐగుప్తు ప్రజలు తూరును గురించి వేదన చెందుతారు. 1