Numbers 35:2
“తాము పొందే వారసత్వాల్లో లేవీయులు నివసించడానికి వారికి పట్టణాలను ఇవ్వాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. ఆ పట్టణాల చుట్టూ ఉన్న పల్లెలను కూడా లేవీయులకు ఇవ్వాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
1యెరికో దగ్గర యొర్దానుకు సమీపంలోని మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఈ విధంగా చెప్పాడు.
3అవి వారి నివాసానికి వారి పట్టణాలవుతాయి. వాటి పొలాలు వారి పశువులకు, మందలకు, వారి ఆలమందలకు ఉండాలి.
Cross References
Leviticus 25:32అయితే లేవీయుల పట్టణాల్లోని ఇళ్ళను వారు ఎప్పుడైనా విడిపించుకోవచ్చు.
Joshua 14:3మోషే రెండు గోత్రాలకూ అర్థగోత్రానికీ యొర్దాను అవతలి వైపున స్వాస్థ్యాలను ఇచ్చాడు. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యమూ ఇవ్వలేదు
Joshua 21:2అప్పుడు వారు కనాను దేశంలోని షిలోహులో వారిని కలిసి “మేము నివసించడానికి పట్టణాలనూ మా పశువులకు పచ్చిక మైదానాలనూ ఇవ్వాలని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించాడు” అన్నారు.
2 Chronicles 11:14యరొబాము, అతని కుమారులు యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయడం వలన వారు తమ గ్రామాలూ, ఆస్తులూ విడిచిపెట్టి, యూదా దేశానికి, యెరూషలేముకు వచ్చారు.
Ezekiel 45:1“మీరు చీట్లు వేసి దేశాన్ని పంచుకునేటప్పుడు భూమిలో ఒక భాగాన్ని యెహోవాకు అర్పణగా ప్రతిష్ఠించాలి. అది 13 కిలోమీటర్ల 500 మీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల 800 మీటర్ల వెడల్పు ఉండాలి. ఈ సరిహద్దుల్లో ఉన్న భూమి ప్రతిష్ఠితమౌతుంది.
Ezekiel 48:8యూదావారి సరిహద్దును అనుకుని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్టించే పవిత్రమైన స్థలం ఉంటుంది. దాని వెడల్పు 13 కిలోమీటర్ల 500 మీటర్లు దాని పొడవు తూర్పు నుండి పడమర వరకూ మిగిలిన భాగాల్లాగా ఉంటుంది. పరిశుద్ధ స్థలం దాని మధ్యలో ఉండాలి.