Numbers 36:2
“ఈ దేశాన్ని చీటీల ప్రకారం ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇవ్వాలని యెహోవా మా ఏలికవైన నీకు ఆజ్ఞాపించాడు. మా సోదరుడు సెలోపెహాదు వారసత్వాన్ని అతని కూతుళ్ళకు ఇవ్వాలని కూడా యెహోవా నీకు ఆజ్ఞాపించాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Numbers 27:1అప్పుడు యోసేపు కొడుకు మనష్షే వంశస్థుల్లో సెలోపెహాదు కూతుళ్ళు వచ్చారు. సెలోపెహాదు హెసెరుకు కొడుకు, గిలాదుకు మనవడు, మాకీరుకు మునిమనవడు. అతని కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.
Numbers 33:54మీరు మీ వంశాల ప్రకారం చీట్లు వేసి ఆ దేశాన్ని వారసత్వంగా పంచుకోవాలి. ఎక్కువ మందికి ఎక్కువ, తక్కువ మందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. చీటీ ప్రకారం ఎవరికి ఏ స్థలం వస్తుందో ఆ స్థలమే అతడు తీసుకోవాలి. మీ తండ్రుల గోత్రాల ప్రకారం మీరు వారసత్వం పొందాలి.
Joshua 14:1ఇశ్రాయేలీయులు కనాను దేశంలో పొందిన స్వాస్థ్యాలు ఇవి.
Job 42:15ఆ దేశమంతటా యోబు కుమార్తెలంత లావణ్యవతులు కనబడలేదు. వారి తండ్రి వారి అన్నదమ్ములతో పాటు వారికి వారసత్వాలు ఇచ్చాడు.