Numbers 5:26
తరువాత యాజకుడు ఆ నైవేద్యంలో నుండి ఓ గుప్పెడు తీసి బలిపీఠం పైన దాన్ని దహించాలి. ఆ తరువాత ఆ నీళ్ళను ఆమెకు తాగించాలి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Leviticus 2:2అతడు దాన్ని యాజకులైన అహరోను కొడుకుల దగ్గరికి తీసుకు రావాలి. అప్పుడు యాజకుడు తన చేతి నిండుగా నూనే, సాంబ్రాణీ కలిసిన సన్నని పిండిని తీసుకుంటాడు. అప్పుడు యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించడానికై ఆ అర్పణని బలిపీఠం పైన వేసి కాల్చాలి. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది.
Leviticus 5:12అతడు యాజకుని దగ్గరికి దాన్ని తీసుకురావాలి. అప్పుడు యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞాపకం చేసుకోడానికి దానిలో నుండి ఒక గుప్పెడు స్మృతి చిహ్నంగా తీసి యెహోవాకి దహనబలి అర్పించే చోట దహించాలి. అది పాపం కోసం చేసే బలి అర్పణ.