Numbers 7:1
మోషే దేవుని మందిర నిర్మాణం ముగించిన రోజునే దాన్ని దానిలోని అలంకరణలతో సహా యెహోవా సేవ కోసం అభిషేకించి పవిత్ర పరిచాడు. బలిపీఠాన్ని, అక్కడ పాత్రలను అభిషేకించి పవిత్ర పరిచాడు. వాటన్నిటినీ అభిషేకించి పవిత్ర పరిచాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 2:3దేవుడు ఆ ఏడవ రోజును ఆశీర్వదించి పవిత్రం చేశాడు. ఆయన తాను చేసిన సృష్టి కార్యం అంతటినుంచీ విశ్రాంతి తీసుకున్న కారణంగా ఆ రోజును పవిత్రపరిచాడు. 1 సృష్టి రెండవ కథనం
Exodus 29:36వారి పాపాలను కప్పివేయడానికి ప్రతిరోజూ ఒక కోడెదూడను పరిహార బలిగా అర్పించాలి. బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేయడానికి దానికి పాపపరిహార బలి అర్పించి దానికి అభిషేకం చేసి తిరిగి ప్రతిష్ఠించాలి.
Exodus 30:29అవన్నీ అతి పవిత్రమైనవిగా ఉండేలా వాటిని పవిత్రపరచాలి. వాటికి తగిలే ప్రతి వస్తువూ పవిత్రం అవుతుంది.
Exodus 40:11గంగాళాన్ని, దాని పీటను అభిషేకించి, వాటిని ప్రతిష్ఠించాలి.
Leviticus 8:10తరువాత మోషే అభిషేకం చేయడానికి నూనె తీసుకున్నాడు. దానితో మందిరాన్నీ, మందిరంలో ఉన్న సమస్తాన్నీ అభిషేకించి వాటినన్నిటినీ శుద్ధీకరణం చేశాడు.
Numbers 7:84మోషే బలిపీఠాన్ని అభిషేకించిన రోజున ఇశ్రాయేలు నాయకులు వీటన్నిటినీ ప్రతిష్టించారు. వారు పన్నెండు వెండి గిన్నెలను, పన్నెండు వెండి పాత్రలను, పన్నెండు బంగారు పాత్రలను ప్రతిష్టించారు. ప్రతి ప్రోక్షణపాత్ర డెబ్భై తులాల బరువున్నది. ఆ ఉపకరణాల వెండి అంతా పరిశుద్ధ స్థలంలో చెలామణీ అయ్యే తులం బరువు ప్రకారం రెండు వేల నాలుగువందల తులాల బరువు.