Proverbs 28:14
ఎల్లప్పుడూ ఎవరైతే చేడు పనులు చేయకుండా భయంతో + 28:14 భయంతో యెహోవాకి ఎల్లప్పుడూ భయపడండి ఉంటారో వాడు ధన్యుడు. హృదయాన్ని కఠినపరచుకొనేవాడు కీడులో పడిపోతాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Happy is the man that feareth alway: but he that hardeneth his heart shall fall into mischief.
In Context
13అతిక్రమాలను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు.
15పేద ప్రజలను పరిపాలించే దుష్టుడు గర్జించే సింహం, దాడి చేసే ఎలుగుబంటి లాంటి వాడు.
Cross References
Exodus 7:22ఐగుప్తు మాంత్రికులు కూడా ఆ విధంగానే చేయగలిగారు. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు.
Exodus 14:23ఫరో సైన్యం, గుర్రాలు, రథాలు, రౌతులు వారిని తరుముకుంటూ సముద్రం మధ్యకు చేరుకున్నారు.
Psalms 2:11భయంతో యెహోవాను ఆరాధించండి, గడగడ వణకుతూ ఆనందించండి. + 2:11 దేవుణ్ణి ఆరాధించే వారు ఆయన పట్ల సరి అయిన భయం కూడా కలిగి ఉండాలి. ఆయన విషయంలో శృతి మించిన చనువు పనికి రాదు. ఇది పాతనిబంధన ఇశ్రాయేలు ప్రజ ఎంతో జాగ్రత్త గా గుర్తుంచుకోవలసిన విషయం. దావీదు దేవుని మందసాన్ని తీసుకు వస్తున్నప్పుడు, మందసం జారి పోతున్న సమయంలో ఉజ్జా అనేవాడు చెయ్యి చాపి దాన్ని పట్టుకున్నందుకు అక్కడికక్కడే అతడు కుప్పగూలి మరణించాడు గదా. 2 సమూ 6:6-8. 1
Psalms 95:8మెరీబా + 95:8 మెరీబా కలహాలు దగ్గర, ఎడారిలో మస్సా దగ్గర ఉన్న సమయంలో మీ పూర్వీకుల్లాగా మీ గుండె కఠినం చేసుకోవద్దు. 1
Proverbs 23:17పాపులను చూసి నీ హృదయంలో మత్సరపడకు. నిత్యం యెహోవా పట్ల భయభక్తులు కలిగి యుండు.
Ecclesiastes 8:12ఒక దుర్మార్గుడు వంద సార్లు పాపం చేసి దీర్ఘకాలం జీవించినా, దేవునిలో భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని గౌరవించేవారు క్షేమంగా ఉంటారని నాకు తెలుసు.