కీర్తన 143:2
నీ సేవకుణ్ణి విచారణలోకి రప్పించకు. ఎందుకంటే ఏ ఒక్కడూ నీ సమక్షంలో నీతిమంతుడు కాదు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
And enter not into judgment with thy servant: for in thy sight shall no man living be justified.
In Context
Cross References
Exodus 34:7ఆయన వేలాది మందికి తన కృప చూపిస్తాడు. అతిక్రమాలు, అపరాధాలు, పాపాలు క్షమిస్తాడు. అయితే దోషులను ఏమాత్రం శిక్షించకుండా ఉండడు. తండ్రుల దోష ఫలితం మూడు నాలుగు తరాలదాకా వారి సంతానం మీదికి రప్పించేవాడు” అని ప్రకటించాడు.
Job 4:17తమ సృష్టికర్త ఎదుట ఒకడు పవిత్రుడౌతాడా?” అంటుంది. 1
Job 14:3అలాంటి వాడిని నువ్వు పట్టించుకుంటున్నావా? నాకు తీర్పు తీర్చడానికి నీ ఎదుటికి రప్పించుకుంటావా? 1
Job 25:4మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ధుడు కాగలడు? 1
Ecclesiastes 7:20ఈ భూమి మీద ఎప్పుడూ పాపం చేయకుండా మంచి జరిగిస్తూ ఉండే నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. 2
Galatians 2:16మనిషి యేసు క్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారానే దేవుడు నీతిమంతుడుగా తీరుస్తాడు గాని, ధర్మశాస్త్ర క్రియల వలన కాదు. ఆ సంగతి ఎరిగిన మనం కూడా ధర్మశాస్త్ర క్రియల వలన గాక క్రీస్తు పట్ల విశ్వాసం ద్వారానే దేవుని చేత నీతిమంతులుగా తీర్పు పొందడానికి యేసు క్రీస్తులో విశ్వాసముంచాము. ధర్మశాస్త్ర క్రియల వలన ఎవరూ నీతిమంతుడని తీర్పు పొందడు గదా.