కీర్తన 149:4
యెహోవా తన ప్రజలందరినీ అమితంగా ప్రేమిస్తున్నాడు. దీనులైన తన ప్రజలకు రక్షణ భాగ్యం ప్రసాదించాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
For the LORD taketh pleasure in his people: he will beautify the meek with salvation.
In Context
Cross References
Psalms 35:27నా నిర్దోషత్వం రుజువు కావాలని కోరుకునే వాళ్ళు ఆనందంతో కోలాహలం చేస్తూ సంతోషిస్తారు గాక! తన సేవకుడి సంక్షేమం చూసి ఆనందించే యెహోవాకు వాళ్ళు నిత్యం స్తుతులు చెల్లిస్తారు గాక! 1
Psalms 117:2ఎందుకంటే ఆయన నిబంధన విశ్వాస్యత మన పట్ల అధికంగా ఉంది. ఆయన నమ్మకత్వం నిరంతరం నిలిచే ఉంటుంది. యెహోవాను స్తుతించండి.
Psalms 147:11తన పట్ల భయభక్తులు ఉన్నవాళ్లంటే, తన అనుగ్రహం కోసం ఎదురు చూసే వాళ్ళంటే ఆయనకు ఆనందం. 1
Song of Solomon 1:11నీకు వెండి పూలతో బంగారు గొలుసులు చేయిస్తాను.
Isaiah 61:10పెళ్ళికొడుకు అందమైన తలపాగా ధరించుకున్నట్టు, పెళ్ళికూతురు నగలతో అలంకరించుకున్నట్టు 1 ఆయన నాకు రక్షణ వస్త్రాలు ధరింపచేశాడు. నీతి అనే అంగీ నాకు తొడిగించాడు. 1 యెహోవాను బట్టి ఎంతో ఆనందిస్తున్నాను. నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉత్సాహపడుతూ ఉంది. 1
Jeremiah 32:41వాళ్లకు మంచి చెయ్యడంలో ఆనందిస్తాను. నా నిండు హృదయంతో, నా ఉనికి అంతటితో కచ్చితంగా ఈ దేశంలో వాళ్ళను నాటుతాను.”