Psalms 19:13
దురహంకార పాపాల్లో పడకుండా నీ సేవకుణ్ణి కాపాడు. అవి నన్ను ఏలకుండా చెయ్యి. అప్పుడు నేను పరిపూర్ణుడిగా ఉంటాను. అనేక అతిక్రమాల విషయం నిర్దోషిగా ఉంటాను. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
12తన పొరపాట్లు తాను తెలుసుకోగలిగే వారెవరు? దాచిన తప్పులనుంచి నన్ను శుద్ధి చెయ్యి. 1
14యెహోవా, నా ఆశ్రయశిలా, నా విమోచకా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారం అవుతాయి గాక.
Cross References
Exodus 21:14అయితే ఒకడు తన పొరుగువాడిపై కోపంతో, కుయుక్తితో వాణ్ణి చంపేసి నా బలిపీఠం దగ్గర ఆశ్రయం పొందాలని చూస్తే వాణ్ణి బయటకు లాగి చంపాలి.
Leviticus 4:13ఇశ్రాయేలు సమాజమంతా పొరపాటుగా తెలియకుండా పాపం చేస్తే, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని అవగాహన లేకుండా చేసి దోషులైతే
Leviticus 4:27సామాన్య ప్రజల్లో ఎవరైనా ఒకరు పాపం చేయాలనే ఉద్దేశం లేకుండా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని పాపం చేయాలని కాకుండా పొరపాటున చేస్తే దోషి అవుతాడు.
Deuteronomy 17:12ఆ ప్రదేశంలో ఎవరైనా అహంకారంతో మీ యెహోవా దేవునికి పరిచర్య చేయడానికి నిలిచే యాజకుని మాటగానీ ఆ న్యాయాధిపతి మాటగానీ వినకపోతే అతన్ని చంపివేయాలి. ఆ విధంగా దుర్మార్గాన్ని ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి రూపుమాపాలి.
1 Samuel 25:39నాబాలు చనిపోయాడని దావీదు విని “నాబాలు చేసిన కీడును యెహోవా అతని తలమీదికే రప్పించాడు. ఆయన సేవకుడినైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి, నాబాలు వలన నేను పొందిన అవమానం తీర్చిన యెహోవాకు స్తుతి కలుగు గాక” అన్నాడు. తరవాత దావీదు అబీగయీలును తాను పెళ్లి చేసుకోవాలని ఆమెతో మాటలాడడానికి తన వారిని పంపాడు.
Job 34:32నాకు తెలియని దాన్ని నాకు నేర్పించు. నేను పాపం చేశాను. ఇకపై చేయను” అని దేవునితో చెప్పాడనుకో, 1