Psalms 21:4
ఆయుష్షు ఇమ్మని అతడు నిన్ను అడిగాడు. నువ్వు దాన్ని అతనికిచ్చావు. శాశ్వతకాలం ఉండే దీర్ఘాయుష్షు అతనికిచ్చావు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
He asked life of thee, and thou gavest it him, even length of days for ever and ever.
In Context
3అతని కోసం శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు తెస్తావు, నువ్వు అతని తల మీద మేలిమి బంగారు కిరీటం పెట్టావు. 1
5నీ జయం వల్ల అతనికి గొప్ప మహిమ కలిగింది. శోభ, ఘనత నువ్వు అతనికి కలగజేశావు. 1
Cross References
1 Kings 2:33అంతే గాక వారి ప్రాణ దోషానికి యోవాబు, అతని సంతతివారే ఎన్నటికీ బాధ్యులు గానీ దావీదుకు, అతని సంతతికి, అతని వంశానికి, అతని సింహాసనానికి ఎన్నటెన్నటికీ యెహోవా శాంతి సమాధానాలు ఉంటాయి.”
2 Kings 11:12అప్పుడు యెహోయాదా యువ రాజు యోవాషుని బయటకు తీసుకు వచ్చాడు. అతని తలపై కిరీటం పెట్టారు. అతని చేతుల్లో ధర్మశాస్త్ర ప్రతిని ఉంచారు. తరువాత వారు అతనికి పట్టాభిషేకం చేసారు. అంతా చప్పట్లు కొట్టి “రాజు చిరకాలం జీవించాలి” అంటూ నినాదాలు చేశారు.
Psalms 16:10ఎందుకంటే నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టవు. నిబంధన నమ్మకత్వం ఉన్నవాణ్ణి చావు చూడనివ్వవు. 1
Psalms 72:17రాజు నామం శాశ్వతంగా నిలుస్తుంది గాక. అతని పేరు సూర్యుడున్నంత కాలం నిలబడుతుంది గాక. అతనిని బట్టి ప్రజలు దీవెనలు పొందుతారు గాక. అన్యజనాలు అతడు ధన్యుడని చెప్పుకుంటారు గాక. 1
Psalms 89:36చంద్రుడున్నంత కాలం అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆకాశంలో ఉన్న ఈ సాక్ష్యం నమ్మకంగా ఉంది. 1
Psalms 119:77నీ ధర్మశాస్త్రం నాకు సంతోషదాయకం. నేను బ్రతికేలా నీ కరుణాకటాక్షాలు నాకు కలుగు గాక. 1