కీర్తన 30:1
యెహోవా, నేను నిన్ను ఘనపరుస్తాను. ఎందుకంటే, నా శత్రువులు నా మీద అతిశయించనియ్యకుండా నీవు పైకెత్తావు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
I will extol thee, O LORD; for thou hast lifted me up, and hast not made my foes to rejoice over me.
In Context
2యెహోవా, నా దేవా, నేను నీకు మొరపెట్టాను. నువ్వు నన్ను స్వస్థపరిచావు. 1
Cross References
Deuteronomy 20:5సేనాధిపతులు ప్రజలతో ఇలా చెప్పాలి. ‘మీలో ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుని దాన్ని ప్రతిష్ట చేయకుండా ఉన్నాడా? యుద్ధంలో అతడు చనిపోతే వేరొకడు దాన్ని ప్రతిష్ట చేస్తాడు. కనుక అలాంటివాడు ఎవరైనా ఉంటే అతడు తన ఇంటికి తిరిగి వెళ్ళొచ్చు.
2 Samuel 6:20దావీదు తన ఇంటివారిని దీవించడానికి వచ్చినప్పుడు, సౌలు కుమార్తె మీకాలు దావీదుకు ఎదురు వచ్చింది. ఆమె “ఇశ్రాయేలీయుల రాజు బానిస పిల్లల ఎదుటా సేవకుల ఎదుటా ఈ రోజు బట్టలు తీసేసి ఎంత గొప్పగా కనబడ్డాడు! ఎవడో పనికిమాలినవాడు విప్పేసినట్టు తన బట్టలు విప్పేసాడు” అంది. అప్పుడు దావీదు,
2 Samuel 20:3దావీదు యెరూషలేములోని తన నగరానికి వచ్చాడు. తన ఇంటికి కాపలాగా ఉంచిన తన ఉపపత్నులు పదిమంది స్త్రీలను కాపాడుతూ వారిని పోషిస్తున్నాడు గానీ వారితో లైంగిక సంబంధం పెట్టుకోలేదు. వారు కాపలాలో ఉండి జీవించినంత కాలం వితంతువుల వలె ఉండిపోయారు.
1 Kings 8:63సొలొమోను 22,000 ఎద్దులను, 1, 20,000 గొర్రెలను, యెహోవాకు సమాధాన బలులుగా అర్పించాడు. ఈ విధంగా రాజు, ఇశ్రాయేలీయులంతా కలిసి యెహోవా మందిరాన్ని ప్రతిష్టించారు.
Psalms 13:4నేను అతన్ని ఓడించాను, అని చెప్పే అవకాశం నా శత్రువుకు ఇవ్వకు. నా ప్రత్యర్ధి మీద నేను జయం పొందాను, అని నా శత్రువు అనకూడదు. అలా జరగకపోతే, నేను పడిపోయినప్పుడు నా శత్రువులు ఆనందిస్తారు. 1
Psalms 27:6అప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే నా తల ఎత్తుగా ఉంటుంది. నేను ఆయన గుడారంలో ఆనంద బలులు అర్పిస్తాను. నేను పాడి, యెహోవాకు స్తుతిగానం చేస్తాను. 1