కీర్తన 35:17
ప్రభూ, నువ్వు ఇక ఎంతకాలం చూస్తూ ఉంటావు? నీవెన్నాళ్లు చూస్తూ ఊరకుంటావు? వాళ్ళ విధ్వంసకరమైన దాడుల నుండి నన్ను కాపాడు. సింహాల నుండి నా ప్రాణాన్ని రక్షించు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Lord, how long wilt thou look on? rescue my soul from their destructions, my darling from the lions.
In Context
16గౌరవం ఏమీ లేకుండా వాళ్ళు నన్ను ఎత్తి పొడిచారు. నన్ను చూస్తూ పళ్ళు కొరికారు. 1
18అప్పుడు నేను మహాసమాజంలో నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అనేకమంది జనాలున్న చోట నిన్ను స్తుతిస్తాను. 1
Cross References
Psalms 10:14నువ్వు దీన్ని గమనించావు. ఎందుకంటే కష్టం, దుఖం కలిగించే వాళ్ళను నువ్వు ఎప్పుడూ గమనిస్తూ ఉంటావు. నిస్సహాయుడు తనను తాను నీకు అప్పగించుకుంటాడు. తండ్రిలేని వాళ్ళను నువ్వు కాపాడతావు. 1
Psalms 22:20ఖడ్గం నుంచి నా ప్రాణాన్ని, కుక్కల పంజాలనుంచి నా విలువైన ప్రాణాన్ని రక్షించు. 1
Psalms 57:4నా ప్రాణం సింహాల + 57:4 సింహాల శత్రువులు మధ్య ఉంది. ఆగ్రహంతో ఊగిపోతున్న వారి మధ్య నేను పండుకుని ఉన్నాను. వారి పళ్ళు శూలాలు, బాణాలు. వారి నాలుకలు పదునైన కత్తులు. 1
Psalms 74:9దేవుని నుండి మరి ఏ సూచకక్రియలూ మాకు కనబడటం లేదు. ఇంకా ప్రవక్త కూడా ఎవరూ లేరు. ఇలా ఎంతకాలం జరుగుతుందో ఎవరికీ తెలియదు. 1
Psalms 94:3యెహోవా, దుర్మార్గులు ఎంతకాలం, ఎంతకాలం గెలుస్తారు? 1
Habakkuk 1:13నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కళంకమైనది గదా. బాధించేవారు చేసే దుర్మార్గతను బాధను నువ్వు చూడలేవు గదా. కపటులను నువ్వు చూసి కూడా, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా చూసి కూడా ఎందుకు ఊరుకున్నావు?