కీర్తన 44:11
వాళ్ళ కోసం ఆహారంగా తయారైన గొర్రెల్లాగా మమ్మల్ని చేశావు. అనేక దేశాల్లోకి మమ్మల్ని చెదరగొట్టావు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Thou hast given us like sheep appointed for meat; and hast scattered us among the heathen.
In Context
12అతి తక్కువ వెలకు మమ్మల్ని అమ్మివేశావు. అలా చేయడం మూలంగా నీ సంపద ఏమీ అధికం కాలేదు. 1
Cross References
Deuteronomy 28:64యెహోవా భూమి ఈ చివర నుంచి ఆ చివరి వరకూ అన్య దేశాల్లో మీరు చెదిరిపోయేలా చేస్తాడు. అక్కడ మీ పితరులు సేవించని చెక్కతో, రాయితో చేసిన అన్య దేవుళ్ళను కొలుస్తారు.
2 Kings 17:6హోషేయ పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు షోమ్రోను పట్టణాన్ని చెరపట్టి ఇశ్రాయేలు వాళ్ళను అష్షూరు దేశంలోకి బందీలుగా తీసుకువెళ్ళాడు. గోజాను నది దగ్గర ఉన్న హాలహు, హాబోరు అనే చోటా, మాదీయుల పట్టణాల్లోనూ వాళ్ళను ఉంచాడు. 1 పాపం ఇశ్రాయేలు పతనానికి, చెరకు కారణం
Psalms 60:1దేవా, మమ్మల్ని విడిచిపెట్టావు. మమ్మల్ని విరగగొట్టావు. మాపై కోపం పెంచుకున్నావు. మమ్మల్ని మళ్ళీ బాగు చెయ్యి. 1
Isaiah 11:11ఆ రోజున మిగిలిన తన ప్రజలను అష్షూరులో నుంచీ. ఐగుప్తులో నుంచీ, పత్రోసులో నుంచీ, కూషులో నుంచీ, ఏలాములో నుంచీ, షీనారులో నుంచీ, హమాతులో నుంచీ, సముద్రద్వీపాల్లో నుంచీ విడిపించి రప్పించడానికి యెహోవా రెండోసారి తన చెయ్యి చాపుతాడు. 1
Jeremiah 32:37చూడు, నాకు కలిగిన కోపోద్రేకాలతో, మహా ఉగ్రతతో నేను వాళ్ళను వెళ్లగొట్టిన దేశాలన్నిటిలో నుంచి వాళ్ళను సమకూర్చి ఈ స్థలానికి మళ్ళీ తీసుకు రాబోతున్నాను. వాళ్ళు ఇక్కడ క్షేమంతో నివాసం ఉండేలా చేస్తాను.
Luke 21:24వారు కత్తిపాలై చనిపోతారు. శత్రువులు వారిని చెరపట్టి యూదులు కాని అన్యజనాల్లోకి తీసుకువెళ్తారు. యూదేతర జాతులు తమ కాలాలు పూర్తి అయ్యేవరకూ యెరూషలేమును కాళ్ళ కింద తొక్కుతారు. 1 మహా తేజస్సులో ప్రభువు రాక మత్తయి 24:29-31