కీర్తన 78:40
అరణ్యంలో వారు ఆయన మీద ఎన్నోసార్లు తిరగబడ్డారు. ఎడారిలో ఆయనను ఎన్నోసార్లు దుఃఖపెట్టారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
How oft did they provoke him in the wilderness, and grieve him in the desert!
In Context
41మాటిమాటికీ దేవుణ్ణి శోధించారు. మాటిమాటికీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి దుఃఖం పుట్టించారు. 1
Cross References
Deuteronomy 9:7ఎడారిలో మీరు మీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకోండి. దాన్ని మరచిపోవద్దు. మీరు ఐగుప్తు దేశంలో బయలుదేరిన రోజు నుండి ఈ ప్రాంతంలో మీరు ప్రవేశించేంత వరకూ మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.
Psalms 78:8ఆయన యాకోబు సంతానానికి శాసనాలు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు సంతానానికి ధర్మశాస్త్రం అనుగ్రహించాడు. తమ సంతానానికి దాన్ని నేర్పించాలని మన పూర్వీకులకు ఆజ్ఞాపించాడు. 1
Psalms 95:8మెరీబా + 95:8 మెరీబా కలహాలు దగ్గర, ఎడారిలో మస్సా దగ్గర ఉన్న సమయంలో మీ పూర్వీకుల్లాగా మీ గుండె కఠినం చేసుకోవద్దు. 1
Psalms 107:11దేవుని మాటపై తిరుగుబాటు చేసినందువల్ల, మహోన్నతుని సూచనలను త్రోసిపుచ్చినందువల్ల ఇది జరిగింది. 1
Isaiah 63:10అయినా వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు. 1 కాబట్టి ఆయన వారికి శత్రువయ్యాడు. తానే వారితో పోరాడాడు. 1
Hebrews 3:15దీని గూర్చి మొదటే ఇలా చెప్పారు. 1 “ఈ రోజే మీరు ఆయన స్వరం వింటే, 1 ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసినట్టు 1 మీ హృదయాలను కఠినం చేసుకోవద్దు.”