ప్రకటన గ్రంథము 1:7
చూడండి! ఆయన మేఘంపై ఎక్కి వస్తున్నాడు. 1 ఆయనను ప్రతి కన్నూ చూస్తుంది. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. 1 భూమిపై ఉన్న జనాలందరూ ఆయనను చూసి గుండెలు బాదుకుంటారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Judges 5:31యెహోవా, నీ శత్రువులందరూ అలాగే నశించాలి. 1 ఆయన్ని ప్రేమించేవాళ్ళు బలిష్టమైన ఉదయించే సూర్యుడిలా ఉంటారు అని పాడారు.” 1 ఆ తరువాత దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.
Job 33:26వాడు దేవుణ్ణి బతిమాలుకుంటే ఆయన వాణ్ణి కటాక్షిస్తాడు. కాబట్టి వాడు ఆయన ముఖం చూసి సంతోషిస్తాడు. ఇలా ఆయన మనిషికి నిర్దోషత్వం దయచేస్తాడు. 1
Psalms 68:1దేవుడు లేస్తాడు గాక, ఆయన శత్రువులు చెదరిపోతారు గాక. ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోతారు గాక. 1
Isaiah 19:1ఇది ఐగుప్తు దేశాన్ని గూర్చిన దైవ ప్రకటన. 1 చూడండి! యెహోవా వడిగా పరిగెత్తే మేఘంపై స్వారీ చేస్తూ ఐగుప్తుకి వస్తున్నాడు. 1 ఐగుప్తు విగ్రహాలు ఆయన సమక్షంలో కంపిస్తున్నాయి. ఐగుప్తు ప్రజల గుండెలు అవిసిపోతున్నాయి. 1
Nahum 1:3యెహోవా తొందరగా కోపం తెచ్చుకోడు. ఆయన సర్వ శక్తిశాలి. దోషులను ఆయన నిర్దోషులుగా చూడడు. యెహోవా తుఫానులో నుండి, సుడిగాలిలో నుండి వస్తాడు. మేఘాలు ఆయన కాలి కింద మన్ను లాగా ఉన్నాయి.
Matthew 24:30అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమా ప్రభావాలతో ఆకాశ మేఘాలపై రావడం చూసి, భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజలు గుండెలు బాదుకుంటారు.