ప్రకటన గ్రంథము 18:3
ఎందుకంటే దేవుని కోపాన్ని తెచ్చే దాని లైంగిక విశృంఖలతా మద్యాన్ని జనమంతా తాగి మత్తెక్కి పడిపోయారు. 1 భూమి మీద రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. లోకంలో వ్యాపారులు ఆమె అధిక సుఖభోగాల ప్రభావం వల్ల సంపన్నులయ్యారు.”
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 47:15నువ్వు ఎవరికోసం చాకిరీ చేసి అలసిపోయావో వారు నీకు ఎందుకూ పనికిరారు. 1 నీ బాల్యం నుండి నీతో వ్యాపారం చేసినవారు తమ తమ చోట్లకు వెళ్లిపోతున్నారు. 1 నిన్ను రక్షించేవాడు ఒక్కడూ ఉండడు.
Jeremiah 51:34యెరూషలేము ఇలా అంటుంది. ‘బబులోను రాజు నెబుకద్నెజరు నన్ను మింగి వేశాడు. నేను ఎండిపోయేలా చేశాడు. 1 నన్ను ఖాళీ కుండగా చేశాడు. కొండ చిలవలాగా నన్ను మింగివేశాడు. 1 నా ఆహారంతో తన కడుపు నింపుకున్నాడు. నన్ను ఖాళీ పాత్రలా చేశాడు.’” 1
Ezekiel 27:9బిబ్లోసుకు చెందిన నిపుణులు నీ ఓడలను బాగుచేసేవాళ్ళు. 2 సముద్రంలో నీ సరకులు కొనడానికి సముద్ర ప్రయాణం చేసే నావికుల ఓడలన్నీ నీ రేవుల్లో ఉన్నాయి. 2
2 Peter 2:1గతంలో కూడా ఇశ్రాయేలీయుల్లో అబద్ధ ప్రవక్తలు ఉండేవారు. అదే విధంగా మీ మధ్య కూడా అబద్ధ బోధకులు లేస్తారు. వారు నాశనకరమైన విరుద్ధ సిద్ధాంతాలను రహస్యంగా ప్రవేశపెడుతూ, తమ కోసం వెల చెల్లించిన ప్రభువును కూడా నిరాకరిస్తారు. దాని ద్వారా తమ మీదికి తామే త్వరగా నాశనం తెచ్చుకుంటారు.
Revelation 17:2భూమిపై రాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. భూమిపై నివసించే వారు ఆమె లైంగిక విశృంఖలత అనే మద్యాన్ని తాగి మత్తులో మునిగారు” అన్నాడు.
Revelation 18:11లోకంలోని వ్యాపారులు కూడా ఆ నగరాన్ని చూసి విలపిస్తారు. ఎందుకంటే, ఇక మీదట తమ వస్తువులు కొనేవారు ఎవ్వరూ ఉండరు.