ప్రకటన గ్రంథము 18:8
కాబట్టి ఆమెకి కీడులన్నీ ఒక్క రోజే కలుగుతాయి. మరణమూ, దుఖమూ, కరువూ వస్తాయి. 1 దేవుడైన ప్రభువు మహా శక్తిశాలి. ఆమెకు తీర్పు చెప్పేది ఆయనే. ఆమె అగ్నికి ఆహుతైపోతుంది.” 1 బబులోను పతనం గురించి విలాపం
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Job 9:19బలవంతుల శక్తిని గూర్చి ప్రశ్న వస్తే “నేనే ఉన్నాను” అని ఆయన అంటాడు. న్యాయ నిర్ణయం గూర్చి వివాదం రేగినప్పుడు “నాకు విరోధంగా వాదించేది ఎవరు?” అని ఆయన అడుగుతాడు. 1
Isaiah 27:1ఆ రోజున యెహోవా చేతితో తన కత్తి పట్టుకుంటాడు. ఆ కత్తి గొప్పది, తీక్షణమైనది, గట్టిది. భీకరమైన సర్పాన్ని, మొసలి రూపాన్ని పోలిన “లేవియాతాన్” ను ఆయన శిక్షిస్తాడు. వంకరలు తిరుగుతూ, జారిపోతున్న సర్పాన్ని శిక్షిస్తాడు. ఆ సముద్ర జీవిని ఆయన సంహరిస్తాడు. 1
Jeremiah 50:31సేనల ప్రభువు అయిన యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు. “అహంకారీ, నేను నీకు విరోధంగా ఉన్నాను. 1 నిన్ను శిక్షించే రోజూ, సమయమూ వచ్చాయి. 1
Jeremiah 51:6బబులోనులో నుండి పారిపోండి. ప్రతి ఒక్కడూ తన ప్రాణాన్ని రక్షించుకోవాలి. దాని పాపానికి పడే శిక్షలో మీరు నాశనం కావద్దు. 1 ఇది యెహోవా ప్రతీకారం చేసే కాలం. ఆమెకు తన పనులను బట్టి ఆయన తిరిగి చెల్లిస్తాడు. 1
1 Corinthians 10:22ప్రభువుకు రోషం కలిగిస్తామా? మనం ఆయనకంటే బలవంతులమా? 1 ఆహారపానీయాల విషయంలో ప్రేమ నియమం రోమా 14:1-23
Revelation 17:16నువ్వు చూసిన పది కొమ్ములు-వారూ ఆ మృగమూ ఆ వేశ్యను ద్వేషిస్తారు. ఆమె బట్టలూడదీసి దిక్కుమాలిన దాన్నిగా చేస్తారు. ఆమె మాంసాన్ని తింటారు. మంటల్లో ఆమెను కాల్చివేస్తారు.