ప్రకటన గ్రంథము 9:20
ఈ కీడుల చేత చావకుండా మిగిలిన మానవాళి పశ్చాత్తాపపడలేదు. వారు దయ్యాలను పూజించడం, తమ చేతులతో చేసిన చూడటానికీ, వినడానికీ, నడవడానికీ శక్తి లేని బంగారంతో, వెండితో, కంచుతో, రాయితో, కర్రతో చేసిన విగ్రహాలను పూజించడం మానలేదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Deuteronomy 31:29ఎందుకంటే నేను చనిపోయిన తరువాత మీరు పూర్తిగా చెడిపోయి నేను మీరు పాటించాలని ఆజ్ఞాపించిన మార్గం తప్పిపోతారని నాకు తెలుసు. ఆయన దృష్టిలో చెడ్డగా ప్రవర్తించి, మీరు చేసే పనులతో యెహోవాకు కోపం పుట్టిస్తారు. రాబోయే రోజుల్లో విపత్తులు మీకు కలుగుతాయి.
2 Kings 22:17ఈ ప్రజలు నన్ను విడిచి ఇతర దేవుళ్ళకు ధూపం వేస్తూ చేసిన ప్రతి పనీ నాకు కోపం పుట్టించింది గనుక నా కోపం ఆరిపోకుండా, ఈ స్థలం మీద రగులుకుంటుంది.
2 Chronicles 34:25వారు నన్ను విడిచి పెట్టి ఇతర దేవుళ్ళకు ధూపం వేసి, తమ పనులతో నాకు కోపం పుట్టించారు కాబట్టి నా కోపాన్ని ఈ స్థలం మీద కుమ్మరిస్తాను. అది ఆరదు.’ అయితే, యెహోవా చిత్తాన్ని తెలుసుకోడానికి నాదగ్గరికి మిమ్మల్ని పంపిన యూదా రాజుకు ఈ విషయం తెలియచేయండి,
Psalms 115:4వారి విగ్రహాలు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతిపనులు. 1
Isaiah 2:8వాళ్ళ దేశం విగ్రహాలతో నిండి ఉంది. 1 వాళ్ళు తమ స్వంత చేతి పనితనంతో చేసిన వాటికీ, తాము వేళ్ళతో చేసిన వాటికీ పూజలు చేస్తారు. 1
Isaiah 41:7‘అది బాగా ఉంది’ అని చెబుతూ శిల్పి కంసాలిని ప్రోత్సాహపరుస్తాడు. 1 సుత్తెతో నునుపు చేసేవాడు దాగలి మీద కొట్టేవాణ్ణి ప్రోత్సాహపరుస్తాడు 1 ఆ విగ్రహం కదిలిపోకుండా వారు మేకులతో దాన్ని బిగిస్తారు. 1