Romans 1:20
ఈ లోకం పుట్టినప్పటి నుండి, అనంతమైన శక్తి, దైవత్వం అనే ఆయన అదృశ్య లక్షణాలు స్పష్టించబడిన వాటిని తేటగా పరిశీలించడం ద్వారా తేటతెల్లం అవుతున్నాయి. కాబట్టి వారు తమను తాము సమర్ధించుకోడానికి ఏ అవకాశమూ లేదు. 1 యూదేతరుల భ్రష్టత్వం, ఏడు దశలు
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 21:33అబ్రాహాము బెయేర్షెబాలో ఒక తమరిస్క చెట్టు నాటాడు. అక్కడ శాశ్వత దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడు.
Deuteronomy 33:27నిత్య దేవుడు నీకు ఆశ్రయం, 1 శాశ్వతమైన హస్తాలు నీ కింద ఉన్నాయి. 1 శత్రువును ఆయన నీ ఎదుట నుంచి గెంటి వేస్తాడు. 1 నాశనం చెయ్యి! అంటాడు. 1
Psalms 8:3నీ చేతి వేళ్ళు తయారు చేసిన నీ ఆకాశాలనూ, వాటి తావులలో నీవుంచిన చంద్రనక్షత్రాలనూ నేను చూసినప్పుడు, 1
Psalms 33:6యెహోవా తన నోటి మాట వల్ల ఆకాశాలను చేశాడు. తన నోటి శ్వాస చేత నక్షత్రాలను చేశాడు. 1
Psalms 104:5భూమి శాశ్వతంగా కదలకుండా ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు. 1
Psalms 119:90నీ విశ్వాస్యత తరతరాలు ఉంటుంది. నీవు భూమిని స్థాపించావు. అది స్థిరంగా ఉంది. 1