Zechariah 1:19
“ఇవి ఏమిటి?” అని నేను నాతో మాట్లాడుతున్న దూతను అడిగాను. అతడు “ఇవి యూదా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు” అని బదులిచ్చాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
18ఆ తరువాత నేను కన్నులెత్తి చూసినప్పుడు నాలుగు కొమ్ములు కనిపించాయి.
20అప్పుడు నలుగురు కంసాలి పనివారిని యెహోవా నాకు చూపించాడు.
Cross References
Ezra 4:4ఆ దేశంలో నివాసం ఉంటున్న ప్రజలు యూదులకి ఇబ్బందులు కల్పించారు, ఆలయం కడుతున్న వారిని ఆటంకపరిచి గాయపరిచారు.
Ezra 5:3అప్పుడు నది ఇవతల అధికారులుగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి, వారితోబాటు మరికొందరు, యూదుల దగ్గరికి వచ్చారు. వారు “ఈ మందిరం కట్టడానికి, గోడలు నిలబెట్టడానికి, మీకు ఎవరు అనుమతి ఇచ్చారు?” అని ప్రశ్నించారు.
Daniel 12:7నారబట్టలు వేసుకుని ఏటి ఎగువన ఉన్న మనిషి మాట నేను విన్నాను. అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకు ఎత్తి నిత్యజీవి అయిన ఆయన నామంలో ఒట్టు పెట్టుకుని “ఒక కాలం కాలాలు అర్థకాలం + 12:7 ఒక కాలం కాలాలు అర్థకాలం మూడున్నర సంవత్సరములు పరిశుద్ధ జనం బలాన్ని కొట్టివేయడం అయిపోయాక వ్యవహారాలన్నీ సమాప్తమై పోతాయి” అన్నాడు.
Habakkuk 3:14పేదలను రహస్యంగా మింగివేయాలని ఉప్పొంగుతూ తుఫానులాగా వస్తున్న యోధుల తలల్లో వారి ఈటెలే నాటుతున్నావు.
Zechariah 1:21“వీళ్ళు ఏమి చేయబోతున్నారు?” అని నేను అడిగాను. ఆయన “ఇవి ఎవ్వరూ తల ఎత్తకుండా యూదా ప్రజలను చెదరగొట్టిన కొమ్ములు. యూదా దేశ నివాసులను చెదరగొట్టడానికి వారిపై దురాక్రమణ జరిగించిన అన్య దేశాల ప్రజలను భయపెట్టడానికి కొమ్ములను నేలమట్టం చేయడానికి ఈ కంసాలి పనివాళ్ళు వచ్చారు” అని నాకు బదులిచ్చాడు.
Zechariah 4:11నేను ఆ దూతను “దీపస్తంభానికి రెండు వైపులా ఉన్న ఈ రెండు ఒలీవచెట్ల భావం ఏమిటి?”