జెఫన్యా 1:14
యెహోవా మహా దినం దగ్గర పడింది. యెహోవా దినం సమీపంగా ఉంది. అతి శీఘ్రంగా వస్తూ ఉంది. వినండి. యెహోవా దినం వచ్చేస్తోంది. పరాక్రమశాలురు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 15:4హెష్బోను, ఏలాలే మొర్ర పెడుతున్నాయి. 1 యాహసు వరకూ వాళ్ళ స్వరం వినిపిస్తూ ఉంది. 1 మోయాబీయుల యోధులు బిగ్గరగా ఏడుస్తున్నారు. 1 వాళ్ళ ప్రాణాలు వాళ్ళల్లో వణుకుతున్నాయి. 1
Isaiah 33:7వాళ్ళ రాయబారులు వీధిలో ఏడుస్తున్నారు. సంధిని కోరుకునే వాళ్ళ రాజనీతిజ్ఞులు ఒకటే రోదిస్తున్నారు. 1
Jeremiah 25:36వినండి, కాపరుల కేకలూ, మందలోని శ్రేష్ఠమైన వాటి గోల వినిపిస్తూ ఉంది. యెహోవా వాళ్ళ పచ్చిక మైదానాలను నాశనం చేస్తున్నాడు. 1
Jeremiah 46:5ఇక్కడ నేనేం చూస్తున్నాను? వాళ్ళు భయకంపితులయ్యారు. పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ సైన్యాలు ఓడిపోయాయి. 1 వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా సురక్షితమైన చోటును వెదుక్కుంటూ వేగంగా పారిపోతున్నారు. అన్నివేపులా భయం ఆవరించింది. యెహోవా చేస్తున్న ప్రకటన ఇది. 1
Ezekiel 7:6అంతం వచ్చేస్తూ ఉంది. అంతం నీకు విరోధంగా కళ్ళు తెరిచింది. చూడండి. అది వచ్చేస్తూ ఉంది.
Ezekiel 7:12ఆ సమయం వచ్చేస్తుంది. ఆ రోజు దగ్గర పడింది. నా కోపం ప్రజలందరి పైనా ఉంది కనుక కొనేవాడు సంతోషించకూడదు.