The Bible Software
bible.software › జెఫన్యా › జెఫన్యా 1 › జెఫన్యా 1:16

జెఫన్యా 1:16

ఆ దినాన ప్రాకారాలున్న పట్టణాల దగ్గర, ఎత్తయిన గోపురాల దగ్గర, యుద్ధ ఘోష, భేరీనాదం వినబడుతాయి.

బైబిల్ (తెలుగు)

In The King James Version

A day of the trumpet and alarm against the fenced cities, and against the high towers.

In Context

15ఆ దినం ఉగ్రత దినం. బాధ, ఉపద్రవం మహానాశనం కమ్ముకు వచ్చే దినం. అంధకారం, మసక కమ్మే రోజు. మేఘాలు ముసిరి గాఢాంధకారం పొదిగే రోజు.

17ప్రజలు యెహోవా దృష్టికి పాపం చేశారు గనక నేను వారి మీదికి ఉపద్రవం రప్పించబోతున్నాను. వారు గుడ్డివారిలాగా నడుస్తారు. వారి రక్తం దుమ్ములాగా ఒలికిపోతుంది. వారి మాంసాన్ని పెంటలాగా పారేస్తారు.

Read all of జెఫన్యా 1

Cross References

Joshua 6:20యాజకులు బూరలు ఊదగానే ప్రజలు కేకలు వేశారు. ఆ బూరల శబ్దం విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేసినపుడు ఆ ప్రాకారం కూలిపోయింది. ప్రజలంతా నేరుగా చక్కగా ఆ ప్రాకారం ఎక్కి పట్టణాన్ని పట్టుకున్నారు.

Isaiah 2:12గర్వం, దురహంకారం, అతిశయం కలిగిన ప్రతివాణ్ణి ఆ రోజున సేనలకు ప్రభువైన యెహోవా కింద పడేస్తాడు. 1

Isaiah 32:14రాజ భవనాన్ని విడిచి పెట్టేస్తారు. జనసమ్మర్దమైన పట్టణం నిర్మానుష్యంగా మారుతుంది. 1 కొండ, నిఘా గోపురాలు ఇక ఎప్పటికీ గుహల్లా ఉంటాయి. 1 అవి అడవి గాడిదలు ఆనందించే స్థలంగానూ, పశువులు మేసే స్థలంగానూ ఉంటాయి. దేవుని ఆత్మ కుమ్మరింపు జరిగే వరకూ ఇలా జరుగుతుంది. 1

Jeremiah 4:19నా హృదయం! నా హృదయం! వేదనతో నా అంతరంగం అల్లాడుతూ ఉంది. నా గుండె బాధగా కొట్టుకుంటూ ఉంది. తాళలేకపోతున్నాను. బాకానాదం వినబడుతున్నది, యుద్ధ ఘోష విని నేను తట్టుకోలేను.

Jeremiah 8:16దాను ప్రాంతం నుండి వచ్చే వారి గుర్రాల బుసలు వినబడుతున్నాయి. వాటి సకిలింపులకు దేశమంతా అదురుతూ ఉంది. 1 వారు వచ్చి దేశాన్ని, దానిలోని సమస్తాన్ని, పట్టణాన్ని దానిలో నివసించే వారిని నాశనం చేస్తారు. 1

Hosea 5:8గిబియాలో బాకా ఊదండి. రమాలో భేరీనాదం చెయ్యండి. “బెన్యామీనూ, మేము మీతో వస్తున్నాం” అని బేతావెనులో కేకలు పెట్టండి.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study జెఫన్యా 1:16

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← జెఫన్యా 1:15జెఫన్యా 1జెఫన్యా 1:17 →