1 Chronicles 25:5
వీళ్ళందరూ దేవుని వాక్కు విషయంలో రాజుకు ప్రవక్త అయిన హేమాను కొడుకులు. హేమానును గొప్ప చెయ్యడానికి దేవుడు హేమానుకు పద్నాలుగు మంది కొడుకులను, ముగ్గురు కూతుళ్ళను అనుగ్రహించాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
1 Samuel 9:9ఇప్పుడు ప్రవక్తగా ఉన్నవాడిని గతంలో దీర్ఘదర్శి అని పిలిచేవాడు. ఇదివరకూ ఇశ్రాయేలీయులు ఎవరైనా దేవుని నుండి ఏదైనా విషయం తెలుసుకోవాలని ఆశించి వెళ్లే సమయంలో “మనం దీర్ఘదర్శి దగ్గరకి వెళ్దాం పదండి” అని చెప్పుకోవడం పరిపాటి.
1 Chronicles 21:9దావీదుకు ప్రవక్త అయిన గాదుతో యెహోవా “నువ్వు వెళ్లి దావీదుతో ఇలా చెప్పు,
2 Chronicles 35:15ఆసాపు సంతతివారైన గాయకులు, తమ స్థలాల్లో ఉన్నారు. ఆసాపూ, హేమానూ, రాజుకు దార్శనికుడైన యెదూతూనూ దావీదు నియమించినట్టుగా తమ స్థలం లో ఉన్నారు. ప్రతి గుమ్మం దగ్గరా ద్వారపాలకులున్నారు. వారు తమ పని విడిచి రాకుండా వారి సోదరులైన లేవీయులు వారి కోసం అర్పణ సిద్ధపరిచారు.
Isaiah 8:18ఇదిగో, నేను, యెహోవా నాకిచ్చిన పిల్లలు. 1 సీయోను కొండ మీద నివసించే సేనల ప్రభువు యెహోవా మూలంగా సూచనలుగా, మహత్కార్యాలుగా ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. 1