The Bible Software
1 దిన · బైబిల్ (తెలుగు)

1 దిన 25

1దావీదు, మందిరం పనుల కోసం ఏర్పరచిన అధిపతులూ కలిసి, ఆసాపు, హేమాను, యెదూతూను అనేవాళ్ళ కొడుకుల్లో కొందరిని సేవ నిమిత్తం ప్రత్యేకపరచి, సితారాలను, స్వరమండలాలను, కంచు తాళాలను వాయిస్తూ ప్రవచించేలా నియమించారు. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వాళ్ళ సంఖ్య ఎంతంటే,

2ఆసాపు కొడుకుల్లో రాజాజ్ఞప్రకారం ప్రవచిస్తూ, ఆసాపు చేతికింద ఉండేవాళ్ళు జక్కూరు, యోసేపు, నెతన్యా, అషర్యేలా, అనే వాళ్ళు.

3యెదూతూను సంబంధుల్లో స్తుతిపాటలు పాడుతూ యెహోవాను స్తుతించడానికి తీగవాయిద్యం వాయిస్తూ ప్రవచించే తమ తండ్రి యెదూతూను చేతికింద ఉండేవాళ్ళు గెదల్యా, జెరీ, యెషయా, హషబ్యా, మత్తిత్యా అనే ఆరుగురు.

4హేమాను సంబంధుల్లో హేమాను కొడుకులు బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు, హనన్యా, హనానీ, ఎలీయ్యాతా, గిద్దల్తీ, రోమమ్తియెజెరు, యొష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు అనేవాళ్ళు.

5వీళ్ళందరూ దేవుని వాక్కు విషయంలో రాజుకు ప్రవక్త అయిన హేమాను కొడుకులు. హేమానును గొప్ప చెయ్యడానికి దేవుడు హేమానుకు పద్నాలుగు మంది కొడుకులను, ముగ్గురు కూతుళ్ళను అనుగ్రహించాడు.

6వీళ్ళందరూ ఆసాపుకూ, యెదూతూనుకూ, హేమానుకూ, రాజు చేసిన కట్టడ ప్రకారం యెహోవా ఇంట్లో తాళాలు, స్వరమండలాలు, తీగ వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, తమ తండ్రి చేతి కింద దేవుని మందిరం సేవ జరిగిస్తూ ఉన్నారు.

7యెహోవాకు పాటలు పాడడంలో నేర్పు గల తమ సహోదరులతో పాటు ఉన్న ప్రవీణులైన వాద్యకారుల లెక్క రెండు వందల ఎనభై ఎనిమిది.

8తాము చేసే సేవ విషయంలో చిన్న అనీ, పెద్ద అనీ, గురువనీ శిష్యుడనీ భేదం లేకుండా వంతుల కోసం చీట్లు వేశారు.

9మొదటి చీటి ఆసాపు వంశంలో ఉన్న యోసేపు పేరట పడింది, రెండోది గెదల్యా పేరట పడింది. ఇతనూ, ఇతని సహోదరులూ కొడుకులూ పన్నెండుమంది.

10మూడోది జక్కూరు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండుమంది.

11నాలుగోది యిజ్రీ పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండుమంది.

12అయిదోది నెతన్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

13ఆరోది బక్కీయాహు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

14ఏడోది యెషర్యేలా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

15ఎనిమిదోది యెషయా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

16తొమ్మిదోది మత్తన్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

17పదోది షిమీ పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

18పదకొండోది అజరేలు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

19పన్నెండోది హషబ్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

20పదమూడోది షూబాయేలు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

21పదునాలుగోది మత్తిత్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

22పదిహేనోది యెరేమోతు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

23పదహారోది హనన్యా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

24పదిహేడోది యొష్బెకాషా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

25పద్దెనిమిదోది హనానీ పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

26పందొమ్మిదవది మల్లోతి పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

27ఇరవయ్యోది ఎలీయ్యాతా పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

28ఇరవై ఒకటోది హోతీరు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

29ఇరవై రెండోది గిద్దల్తీ పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

30ఇరవై మూడోది మహజీయోతు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

31ఇరవై నాలుగోది రోమమ్తీయెజెరు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది.

← 1 దిన 24Read In The App, Free →1 దిన 26 →

Study 1 దిన 25

KJVMatthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)Reina-Valera (Español)Bíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)

All Chapters

1234567891011121314151617181920212223242526272829