1 Chronicles 28:21
దేవుని మందిర సేవంతటికీ, యాజకులూ, లేవీయులూ వంతుల ప్రకారం ఏర్పాటయ్యారు. నీ ఆజ్ఞకు లోబడి ఉంటూ ఈ పనంతా నెరవేర్చడానికి వివిధ పనుల్లో ప్రవీణులైన వాళ్ళూ, మనస్పూర్తిగా పని చేసేవాళ్ళూ, అధిపతులూ, ప్రజలందరూ, నీకు సహాయకులుగా ఉంటారు” అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Exodus 31:3అతనికి నేను అన్ని రకాల పనులు చెయ్యడానికి తెలివితేటలు, సమస్త జ్ఞానం, నేర్పరితనం ప్రసాదించాను. అతణ్ణి నా ఆత్మతో నింపాను.
Exodus 36:1మోషే “పవిత్ర స్థలం లో జరిగే సేవ కోసం అన్నిరకాల పనులు చేయడానికి బెసలేలు, అహోలీయాబు మొదలైన ప్రతిభావంతులను నియమించాము. ఈ పనులు చేయడానికి యెహోవా వాళ్లకు జ్ఞానం, వివేకం ప్రసాదించాడు. వీళ్ళు యెహోవా ఆజ్ఞాపించినట్టు పనులు జరిగిస్తారు” అన్నాడు.
1 Chronicles 22:17దావీదు తన కొడుకు సొలొమోనుకు సాయం చెయ్యాలని ఇశ్రాయేలీయుల అధిపతులందరికీ ఆజ్ఞాపించాడు.
1 Chronicles 24:24ఉజ్జీయేలు సంతానంలో మీకా, మీకా సంతానంలో షామీరు,
1 Chronicles 26:26రాజైన దావీదూ, పూర్వీకుల కుటుంబాల పెద్దలూ, సహస్రాధిపతులూ, శతాధిపతులూ, సైన్యాధిపతులూ ప్రతిష్ఠించిన ప్రత్యేకమైన సామగ్రి ఉన్న గిడ్డంగులకు షెలోమీతూ, అతని సహోదరులూ కావలి కాసేవాళ్ళయ్యారు.
Psalms 110:3నీవు నీ వైభవాన్ని ప్రదర్శించేటప్పుడు నీ ప్రజలు ఇష్టపూర్వకంగా నీతో వస్తారు. అరుణోదయ గర్భంలో నుండి కురిసే మంచులాగా నీ యవ్వనం ఉంటుంది. 1