1 సమూ 18:25
ఫిలిష్తీయుల చేతికి దావీదు చిక్కేలా చేయాలన్న తలంపుతో సౌలు “రాజు కన్యాశుల్కం ఏమీ కోరడం లేదు, అయితే రాజు శత్రువులమీద పగతీర్చుకోవడానికి కేవలం వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తీసుకురావాలని కోరుతున్నాడని దావీదుకు చెప్పండి” అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
24సౌలు సేవకులు దావీదు చెప్పిన మాటలు అతనికి తెలియచేశారు.
26సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకు చెప్పినప్పుడు, రాజుకు అల్లుడు కావాలన్న కోరికతో
Cross References
Genesis 29:18యాకోబు రాహేలును ప్రేమించి “నీ చిన్న కూతురు రాహేలు కోసం నీకు ఏడు సంవత్సరాలు సేవ చేస్తాను” అన్నాడు.
Exodus 22:16ఒకడు పెళ్లి నిర్ణయం కాని ఒక కన్యను లోబరచుకుని ఆమెతో తన వాంఛ తీర్చుకుంటే ఆమె కోసం కట్నం ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలి.
1 Samuel 14:24“నేను నా శత్రువులపై పగ సాధించే వరకూ, సాయంత్రమయ్యే దాకా భోజనం చేసేవాడు శాపానికి గురి అవుతారు” అని సౌలు ప్రజల చేత ఒట్టు పెట్టించాడు. అందుకని ప్రజలు ఏమీ తినకుండా ఉన్నారు.
1 Samuel 17:36నీ సేవకుడనైన నేను సింహాన్నీ ఎలుగుబంటినీ చంపాను. సజీవుడైన దేవుని సైన్యాన్ని దూషించిన ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు కూడా వాటిలో ఒకదానిలాగా అవుతాడు.
1 Samuel 19:1మీరు దావీదును చంపేయాలని సౌలు తన కొడుకు యోనాతానుతో, సేవకులందరితో చెప్పాడు.