1 సమూ 26:23
“యెహోవా ఈ రోజున నిన్ను నాకు అప్పగించినప్పటికీ, నేను యెహోవా వలన అభిషేకించబడిన వాణ్ణి చంపకుండా వదిలినందువల్ల ఆయన నా నీతి, విశ్వాస్యతను బట్టి నాకు తగిన బహుమానం ఇస్తాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
22దావీదు “రాజా, ఇదిగో నీ ఈటె నా దగ్గర ఉంది. పనివాళ్ళలో ఒకడు వచ్చి దీన్ని తీసుకోవచ్చు” అన్నాడు.
Cross References
1 Samuel 24:6“ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు కాబట్టి యెహోవా చేత అభిషిక్తుడైన నా రాజు పట్ల నేను ఈ పని చేయను, యెహోవాను బట్టి నేను అతణ్ణి చంపను” అని తన వారితో చెప్పాడు.
1 Samuel 24:11నా తండ్రీ, చూడు. నిన్ను చంపకుండా నీ బట్ట చెంగును మాత్రమే కోశాను. దీన్ని బట్టి నా వల్ల నీకు ఎలాంటి కీడూ రాదనీ నాలో ఎలాంటి తప్పూ లేదనీ నువ్వు తెలుసుకోవచ్చు. నీ విషయంలో నేను ఏ పాపమూ చేయకుండా ఉంటే నువ్వు నా ప్రాణం తీయాలని నన్ను తరుముతున్నావు.
1 Samuel 26:11యెహోవా వలన అభిషేకం పొందినవాణ్ణి నేను చంపను. అలా చేయకుండా యెహోవా నన్ను ఆపుతాడు గాక. అయితే అతని దిండు దగ్గర ఉన్న ఈటె, నీళ్లబుడ్డి తీసుకు మనం వెళ్ళిపోదాం పద” అని అబీషైతో చెప్పాడు.
2 Samuel 22:25నా నీతినిబట్టి యెహోవా నాకు పూర్వ క్షేమస్థితి కలిగించాడు 1 తన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు. 1
Nehemiah 13:14నా దేవా, దీన్నిబట్టి నన్ను జ్ఞాపకముంచుకో. నా దేవుని ఆలయం కోసం, దాని క్రమాల అమలు కోసం నేను చేసిన పనులు మరచిపోవద్దు.
Psalms 7:8యెహోవా, జాతులకు తీర్పు తీర్చు. నేను ఏ తప్పూ చెయ్యలేదు గనక, నేను న్యాయం జరిగించాను గనక, యెహోవా, మహోన్నతుడా, నా మాట నిజం చెయ్యి. 1