1 తిమోతి పత్రిక 3:16
మన దైవభక్తిని గురించి వెల్లడైన సత్యం గొప్పది. 1 ఏ సందేహమూ లేదు. ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. 1 ఆయన నీతిపరుడని ఆత్మ తీర్పునిచ్చాడు. 1 ఆయనను దేవదూతలు చూశారు. 1 దేశ దేశాల్లో ఆయన ప్రచారం అయ్యాడు. 1 లోకం ఆయనను నమ్మింది. 1 మహిమతో ఆయన ఆరోహణమయ్యాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 7:14కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు. వినండి, కన్య గర్భం ధరించి కుమారుణ్ణి కని అతనికి ‘ఇమ్మానుయేలు’ అని పేరు పెడుతుంది. 1
Isaiah 50:5ప్రభువైన యెహోవా నా చెవికి వినే బుద్ధి పుట్టించాడు కాబట్టి నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా దూరం జరగలేదు. 1
Micah 5:2బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబాల మధ్య నువ్వు చిన్న గ్రామమైనా నా కోసం ఇశ్రాయేలీయులను పాలించేవాడు నీలోనుంచి వస్తాడు. ఆయన పూర్వకాలం నుంచి, నిత్యం నుంచి ఉన్నవాడు. 1
Matthew 3:16యేసు బాప్తిసం పొంది నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాడు. వెంటనే ఆకాశం తెరుచుకుంది. దేవుని ఆత్మ పావురంలాగా దిగి తన మీద వాలడం ఆయన చూశాడు.
Matthew 13:11“పరలోక రాజ్య మర్మాలు గ్రహించే భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించాడు, వారికి అనుగ్రహించలేదు.
Mark 1:13ఆయన అక్కడ నలభై రోజులుండి సైతాను చేత పరీక్షలకు గురయ్యాడు. అడవి మృగాల మధ్య జీవించాడు. దేవుని దూతలు ఆయనకు సపర్యలు చేశారు. 1 గలిలయ పరిచర్య ఆరంభం మత్తయి 4:12-17; లూకా 4:14